బాలీవుడ్

Deepika Padukone: షూటింగ్‌లో దీపికాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. అసలు నిజమిది!

Deepika Padukone: దీపికా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై తన పీఆర్ టీమ్ స్పందించింది.

Deepika Padukone: షూటింగ్‌లో దీపికాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. అసలు నిజమిది!
X

Deepika Padukone: బాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లలో ఎంతోమంది ఇప్పటికీ టాప్ 1 స్థానాన్ని ఎంజాయ్ చేశారు. యంగ్ హీరోయిన్ల తాకిడి ఎక్కువయిన తర్వాత ఇప్పుడిప్పుడే సీనియర్ హీరోయిన్లు సినిమాలు చేయడంలో కాస్త స్పీడ్ తగ్గించారు. అలాంటి సీనియర్ హీరోయిన్లలో దీపికా పదుకొనె కూడా ఒకరు. తాజాగా దీపికా.. అస్వస్థతకు గురయ్యిందని, హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై తన పీఆర్ టీమ్ స్పందించింది.


ప్రస్తుతం దీపికా పదుకొనె.. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌లో కూడా అడుగుపెట్టింది. అంతే కాకుండా తను ఇటీవల తిరుమలను కూడా దర్శించుకోవడానికి వెళ్లింది. ఇంతలోనే దీపికా అస్వస్థకు గురైందని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో చేరి చికిత్స పొందుతుందని రూమర్స్ వచ్చాయి.


దీపికా పదుకొనె పీఆర్ టీమ్ ఈ వార్తలపై స్పందిస్తూ.. తను జెనరల్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లిందని తెలిపారు. రిపోర్ట్‌లు అన్నీ బాగానే ఉన్నాయని, దీపికా షూటింగ్స్‌లో పాల్గొంటుందని వారు అన్నారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందకూడదని, తన అన్ని విధాలుగా బాగుందని వారు స్పష్టం చేశారు. దీపిక ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ నమొద్దని వారు అన్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES