AP : 2 నెలల్లో ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్.. సర్కారు ప్రకటన

AP : 2 నెలల్లో ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్.. సర్కారు ప్రకటన
X

మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకె ళ్తున్నదని చెప్పారు. నాయుడుపేటలో ఇవాళ మంత్రి రాంప్రసాదొడ్డి పర్యటించారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు, 64 లక్షల మందికి 30వ తేదీన పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి.. కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామని హామీ ఇచ్చారు

Tags

Next Story