AP : రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు కోర్టు

AP : రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు కోర్టు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్‌ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసును పెదకాకాని పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం శుక్రవారం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోయారంటూ కేసు కొట్టేసింది.

Tags

Next Story