Kangana Ranaut: నెపోటిజంపై కంగన దుమారం

X
By - Chitralekha |21 Feb 2023 3:02 PM IST
వీళ్లు మళ్లీ వచ్చేశారంటూ అవాక్కులు; ట్వీట్లతో ఆలియాపై విరుచుకుపడుతున్న వైనం...
కంగనా రనౌత్, ఈ పేరే కాంట్రావర్శీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. ఏ అంశాన్నైనా వివాదాస్పదంగా మార్చగల సత్తా ఉన్న ఈ నటీమణి మరోసారి ఇండస్ట్రీలో వారసత్వంపై తన వాక్కులతో విరుచుకుపడుతోంది. ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభాపాటవాలు కనబరచిన వారికి ఉద్దేశించిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల ప్రధానోత్సవంపై మండిపడింది. గంగూభాయ్ చిత్రంలో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ అలియా భట్ కు ఉత్తమ నటి పురస్కారం లభించడమే అమ్మడి ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. ఇక తన వాక్ ప్రవాహానికి ట్విట్టర్ తోడవ్వడంతో వరుస ట్వీట్లతో చెలరేగిపోయింది. ఆలియాకు అవార్డు లభించడంపై నిరసనగా నెపో కిడ్స్ మళ్లీ వచ్చేశారు అంటూ ట్వీట్ చేసింది. ఈ వారసులు నిజమైన ప్రతిభావంతులకు దక్కాల్సిన పురస్కారాలను లాగేసుకుంటున్నారని ఘాటుగా స్పందించింది. అంతేకాదు 2022లో అద్భుతమైన ప్రతిబాపాటవాలు ప్రదర్శించి, ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులైన వారి పేర్లనూ వెల్లడించింది. రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా, సీతారామంలో నటించిన మృణాళ్ ఠాకుర్ ఉత్తమ నటి పురస్కారాలు పొందేందుకు సరైన అర్హులు అంటూ ట్వీట్ చేసింది. ఇక బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ సహాయనటుడిగా అనుపమ్ ఖేర్, ఉత్తమ సహాయ నటిగా టబుకు పురస్కారాలు దక్కాలని తెలిపింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్లు అతి పెద్ద కుట్ర అంటూనే త్వరలోనే అర్హులైన వారి పేర్లను వెల్లడిస్తానని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com