Kriti Sanon: డేటింగ్ రూమర్లపై ఓపెన్ అయిపోయింది....

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఎట్టకేలకు మన డార్లింగ్ తో డేటింగ్ గురించి ఓపెన్ అయిపోయింది. ఆది పురుష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన దగ్గర నుంచీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ లెక్కలేనన్ని పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మీడియా కంట పడిన ప్రతీ సారీ ఇటు ప్రభాస్ ను, అటు కృతిని ఇవే ప్రశ్నలతో ముంచెత్తేశారు. కానీ, ఇద్దరూ ఈ విషయంలో ఒకే మాట మీద నిలబడ్డారా అన్నట్లు అంతుచిక్కని స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి తప్ప మరే విషయమూ బయటకు రాలేదు. మరోవైపు ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ లో అబ్బే తమ మధ్య అదేం లేదంటూ ముక్తసరిగా ముగించేశాడు. అయితే తోడేలు సినిమా ప్రమోషన్లలో వరుణ్ ధవన్ ప్రభాస్-కృతి మధ్య అనుబంధంపై పరోక్షంగా స్పందించాడు. పేర్లు వెల్లడించకుండా ఆమె జీవితంలో ఎవరో ఉన్నారు అంటూ ఆటపట్టించాడు. దీంతో ఆ అబ్బాయి ప్రభాసే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా ఈ రూమర్లపై కృతి స్పందించింది. ఈ వార్తలపై మాట్లాడి అనవసరం వాటికి మరింత ప్రాధాన్యత ఇవ్వదలచుకోవడంలేదని స్పష్టం చేసింది. ఒకవేళ తాను గానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఈవార్తల వల్ల ఇబ్బందులు పడుతుంటే తప్పకుండా స్పందిస్తానని తెల్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com