Kriti Sanon: 'ఆదిపురుష్'పై కృతి కామెంట్స్.. తన క్యారెక్టర్ గురించి చెప్తూ..

Kriti Sanon: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. కానీ ఆ సినిమాల నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు. అందుకే ఏ చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసమే 'ఆదిపురుష్' విశేషాలను పంచుకుంది కృతి సనన్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుంది.
మోడల్‌గా ఎన్నో యాడ్స్‌లో నటించిన కృతి.. మహేశ్ హీరోగా వచ్చిన 'వన్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ బాలీవుడ్ భామ డెబ్యూ ఇచ్చింది తెలుగులోనే అయినా.. హిందీ చిత్రాలతోనే ఎక్కువ బిజీ అయిపోయింది. పైగా కృతి నటించిన సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ అవుతుండడంతో బాలీవుడ్ మేకర్స్ అంతా డేట్స్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్‌తో ఆదిపురుష్‌లో జోడీకట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.
సీతలాంటి పాత్రలో నటించడం తను బాధ్యతగా తీసుకున్నానని చెప్పుకొచ్చింది కృతి సనన్. 'ఆదిపురుష్ అనేది ఓ ప్రత్యేకమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో అడుగుపెట్టడానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ ప్రపంచం గురించి నాకు తెలియదు. అందులో ఓ ముఖ్యమైన పాత్రను నేను ఎలా పోషించగలనో తెలియదు. ఇంత భారంతో ఓ నటిగా అలాంటి పాత్ర చేయడం చాలా బాధ్యతగా అనిపిస్తుంది.' అని తెలిపింది కృతి. ఆదిపురుష్‌లో ప్రభాస్, కృతి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలవనుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com