రాపర్ తో శ్రీదేవి తనయ చట్టాపట్టాల్...

రాపర్ తో శ్రీదేవి తనయ చట్టాపట్టాల్...
కెనెడియన్ రాపర్ తో డేటింగ్ చేస్తోన్న కుషీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ కుషీ కపూర్ ఆర్చీస్ సినిమాతో వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ఆర్చీస్ టీజర్ లో అమ్మడు తన అమ్మను మరింపించేందుకు సిద్ధమవుతోందని అర్ధమవుతూనే ఉంది. అయితే మొదటి సినిమా ఇంకా విడుదలవ్వకుండానే కుషీ డేటింగ్ పాఠాలు మొదలు పెట్టేసిందట. ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసి మళ్లీ మొదటి లవర్ శిఖర్ తోనే సెటిల్ అయినట్లు కనిపిస్తోంది. ఇక కుషీ కూడా తన ప్రేమ పాఠాలు వల్లించేందుకు సిద్ధమవుతుండటంతో అందరి కళ్లు అమ్మడిపైనే ఉన్నాయి. అయితే కుషీ ప్రేమలో పడింది అషామాషీ కుర్రాడితో కాదు మరి. అబ్బాయి కూడా పెద్ద స్టారే.. పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఇండో -కెనెడియన్ సింగర్ ఏపీ థిల్లాన్ తో కుషీ డేటింగ్ చేస్తోందట. ఇటీవలే కొత్త ఆల్బమ్ రిలీజ్ చేసిన థిల్లాన్ లిరిక్స్ లో కుషీ పేరు వాడటంతో ఈ డేటింగ్ రూమర్లకు ఆద్యం పోసింది. నువ్వు నవ్వితే కుషీ కపూర్ లా ఉంటావు అనే అర్థం వచ్చే లిరిక్స్ పై నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాలి.

Tags

Read MoreRead Less
Next Story