Salman Buys High End SUV: భాయ్ జాన్ భయపడ్డాడా!?

Salman Buys High End SUV: భాయ్ జాన్ భయపడ్డాడా!?
రక్షణా పరంగా ఉత్తమమైన ఫీచర్లు ఉన్న కారు కొన్న సల్మాన్ ఖాన్; బెదిరింపులకు భయపడే ఈ పనిచేశాడంటోన్న బృందం.
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన పాపం పీడకలలా ఇంకా వెంటాడుతూనే ఉందని చెప్పాలి. కేసు సద్దుమణిగినప్పటికీ బిష్ణోయ్ తెగకు ఆగర్భ శత్రువుగా మారిన సల్మాన్ ఖాన్ కు తాజాగా ఆ గ్యాంగ్ నుంచి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను చంపుతానని మీడియా ముందు నేరుగానే బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సల్మాన్ ఆ బెదిరింపులను తేలిగ్గానే తీసుకుంటున్నట్లు కనిపించాడు. కానీ, నిజానికి భాయ్ జాన్ గట్టిగానే భయపడ్డాడని తెలుస్తోంది. అందుకే ఎస్ యూ వీ లో హై ఎండ్ కారైన బుల్లెట్ ప్రుఫ్ మోడల్ ను కొనుగోలు చేశాడట సల్లూమియా. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఈ మోడల్ అందుబాటులో లేనప్పటికీ, భారీగా ఖర్చుపెట్టి వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాడట. ఏమైనా భాయ్ జాన్ చల్లగుండాలన్నదే అభిమానుల మాట కూడా.

Tags

Read MoreRead Less
Next Story