Satish Koushik Death: బాలీవుడ్ నటుడు, దర్శకుడు కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత సతీశ్ కౌశిక్ కన్నుమూశారు. ఢిల్లీలో కారులో ప్రయాణిస్తోన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. శవ పంచనామా ప్రక్రియ పూర్తవుతూనే ఆయన మృతదేహాన్ని ముంబైకు తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. మార్చ్ 7న ముంబైలోని జావేద్ అక్తర్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకలకు హాజరైన సతీశ్ కౌశిక్ ఇతర సెలబ్రిటీలతో కలసి ఆనందంగా సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ తో ఆనందం పంచుకున్నారు. ఇక్కడ హోలీ సంబరాలు ముగుస్తూనే మార్చ్ 8న ఢిల్లీలోని కుంటుంబ సభ్యులతో కలసి హోలీ జరుపుకునేందుకు ఆయన వెంటనే ఢిల్లీ బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే వేడుకల అనంతరం గుండె నొప్పు రావడంతో స్థానికంగా ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే కారులో గుండెపోటు సంభవించడంతో ప్రాణాలు విడిచారు. హర్యాణాకు చెందిన సతీశ్ కౌశిక్ 1987లో మిస్టర్ ఇండియా సినిమాతో నటుడిగా తన కెరీస్ స్టార్ట్ చేశారు. అనంతరం దర్శకుడిగానూ మారారు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com