Shraddha Kapoor : ఎన్టీఆర్ తో శ్రద్ధా స్పెషల్ సాంగ్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది. టాలీవుడ్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ఈ అమ్మడు మరో మూవీ చేయలేదు. ఇక బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలైన స్త్రీ 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉంది శ్రద్ధా కపూర్. అయితే టాలీవుడ్ లో భారీ బడ్జెట్తో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్లో శ్రద్ధాకపూర్ కనిపిస్తుందని టాక్ వచ్చింది. కానీ ఆ అవకాశం టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కొట్టేసింది. తాజా అప్డేట్స్ ప్రకారం ఈ అమ్మడు జూ. ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట. జూ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వార్ 2 మూవీ రూపొందుతోంది. అయాన్ డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు సైన్ చేసిందని టాక్.దీనిపై మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com