Bollywood : ఆ నిర్మాత అవమానించాడు : విద్యాబాలన్
కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో సవాళ్లు, రిజెక్షన్స్ ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపారు. దక్షిణాదికి చెందిన ఒక నిర్మాత తనని అవమానించాడని అన్నారు. ఆయన మాటలకు దాదాపు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చక్రం’ అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చా. అనివార్య కారణాల వల్ల షూటింగ్ దశలోనే ఆ సినిమా ఆగిపోవడంతో మిగిలిన సినిమాల్లో నన్ను తొలగించి వేరే హీరోయిన్స్‌ను పెట్టుకున్నారు. మూడేళ్లపాటు బాధపడ్డా. సినిమాలు మనకు సెట్ కావని అమ్మ చెబుతుండేది. కొంతకాలానికి ఒక తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. చక్రం ఆగిపోయిందని తమిళ నిర్మాతకు తెలిసింది. దాంతో ఆయన నా జాతకం చూపించాడు. తమ చిత్రానికి సెట్ కానని తొలగించాడు. విషయం తెలిసి.. నా తల్లిదండ్రులతో ఆయన్ని కలిశా. సినిమా కోసం షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు చూపిస్తూ.. ఒక్కసారి ఆమె ముఖం చూడండి హీరోయిన్‌లా ఎక్కడైనా కనిపిస్తుందా? డ్యాన్స్ రాదు. యాక్టింగ్ రాదని అవమానించాడు. దాదాపు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయా. నాపై నాకే అసహ్యం వేసిందని విద్యాబాలన్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com