Salman Khan : సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

Salman Khan : సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
X

బాలీవుడ్ నటుడు స‌ల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి స‌ల్మాన్‌కు ఆగంతు‌కులు రెండు ఆప్ష‌న్స్ ఇచ్చిన‌ట్లు పోలీస్ వ‌ర్గాలు తెలిపాయి. ప్రాణాలతో ఉండాలంటే క్షమాపణ చెప్పాలి లేదా 5 కోట్ల రూపాయలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్‌కు ఇది రెండో బెదిరింపు మెసేజ్ కావడం ఆయన వర్గాలను టెన్షన్ పెడుతోంది. ముంబ‌యి పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూంకు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పేరిట ఈ మెసేజ్ వ‌చ్చిన‌ట్లు తెలిపాయి.సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి.. లేదంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలనిఅందులో హెచ్చరించారు. అలా చేయకుంటే చంపేస్తాం.. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉందని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం వ‌చ్చింది.ప్ర‌స్తుతం ఈ సందేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story