Sonakshi Sinha : ఈ ఏడాది ఊహించని సర్‌ప్రైజులు : సోనాక్షి సిన్హా

Sonakshi Sinha : ఈ ఏడాది ఊహించని సర్‌ప్రైజులు : సోనాక్షి సిన్హా
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుండి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘కాకూడ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఇంకొన్ని రోజుల్లో 2024కు గుడ్‌బై చెప్పబోతున్నామంటే కాస్త బాధగా ఉంది. ఎందుకంటే నా జీవితాన్ని ఆనందమయం చేసిన సంవత్సరం ఇది. నేను ఊహించని రెండు సర్‌ప్రైజులు ఈ ఏడాది నాకిచ్చింది. పెళ్లితో జీవితంలోని ముఖ్యమైన ఘట్టాన్ని మొదలుపెట్టాను. అలాగే భన్సాలీ డైరెక్షన్‌లో నటించే అరుదైన అవకాశం ‘హీరామండీ’తో లభించింది. అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా ఈ ఏడాది నాకు చాలా స్పెషల్‌. ఈ సంతోషంలోనే 2025లోకి అడుగుపెడుతున్నాను. వచ్చే ఏడాది నటిగా కొత్త సోనాక్షిని చూస్తారు" అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి.

Tags

Next Story