Vijay Deverakonda: బాలీవుడ్ షోలో విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరి తర్వాత రౌడీ హీరోకే ఛాన్స్..

Vijay Deverakonda: ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ పెద్దగా పట్టించుకోకపోయేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లాస్‌లో ఉండడానికి సౌత్ సినిమాలే కారణమవుతున్నాయి. హిందీలో డబ్ అయిన సౌత్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడంతో ఇక్కడ నటీనటులను, మేకర్స్‌ను ప్రశంసలతో ముంచేస్తోంది బాలీవుడ్. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కూడా బాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరిగిపోతోంది.
ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు. తాను నటించిన చిత్రలేవీ బాలీవుడ్‌లో హైప్‌తో విడుదల అవ్వలేదు. కానీ బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న క్రేజ్ మరే ఇతర టాలీవుడ్ హీరో సంపాదించుకోలేదు. అందుకే కరణ్ జోహార్‌లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం విజయ్‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.
బాలీవుడ్‌లో కొన్ని షోలు అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి కాఫీ విత్ కరణ్. కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటారు. అయితే ఈ షోకు తెలుగు హీరోల నుండి ఇప్పటివరకు ప్రభాస్, రానా మాత్రమే వెళ్లారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ లిస్ట్‌లో మూడో హీరోగా యాడ్ అవ్వనున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నట్టు తెలియజేసే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
That signature - The Vijay Deverakonda #VijayDeverakonda #KaranJohar #koffeewithkaran #TeamDeverakonda pic.twitter.com/HmR9oSwA7K
— Team Deverakonda (@TeamDeverakonda) May 29, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com