Yuvagalam : అశేష జనవాహిని మధ్య నారా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తుంది. లోకేష్ వెనక అన్ని వర్గాల ప్రజలు కలిసి నడుస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న నారా లోకేష్ స్వయంగా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు. మహిళలు మంగళహారతులు పడుతున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు.. జై లోకేష్, జై టీడీపీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాసేపట్లో ఆళ్లగడ్డ శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం విడిది కేంద్రం వద్ద లోకేష్ విత్ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా లోకేష్‌తో ఫోటోలు దిగేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. కాసేపట్లో భూమా బాలిరెడ్డి నగర్‌లో బుడగజంగాలతో లోకేష్ భేటీ అవుతారు. పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఆళ్లగడ్డ చౌరస్తాలో స్థానికులతో మాటమంతీ నిర్వహిస్తారు. ప్రభుత్వ కాలేజీ వద్ద వాల్మీకి బోయలతో సమావేశమవుతారు. కాసేపట్లో సీఎస్‌ఐ చర్రచ్ దగ్గర క్రిస్టియన్లతో భేటీ అవుతారు. అనంతరం పాతబస్టాండు వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న నారా లోకేష్.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com