Business: జూన్‌లో ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన 10 స్టాక్స్ ఇవే..

Business: మార్కెట్లలో మంచి ఫండమెంటల్స్, టెక్నికల్‌గా బుల్లిష్‌గా ఉన్న స్టాక్స్‌ని మాత్రమే కాదు. ఫ్యూచర్‌లో పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న కంపెనీలను వలవేసి, ఒడిసిపట్టడంలో కొందరు నేర్పరులు. వారినే ఏస్ ఇన్వెస్టర్లంటారు. అలాంటి నలుగురు టాప్ మోస్ట్ పర్సనాలిటీలు జూన్ త్రైమాసికంలో ఓ పది స్టాక్స్‌ని కొనుగోలు చేశారు. డాలీఖన్నా, అనిల్ కుమార్ గోయల్ అకా ఏకే గోయల్, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా, ఆశిష్ కచోలియా ఈ నలుగురు గత మూడు నెలల్లో కొనుగోలు చేసిన స్టాక్స్ పెర్ఫామెన్స్ మీరే చూడండి..
పాలీప్లెక్స్ కార్పోరేషన్ -21% లాభం
నితిన్ స్పిన్నర్స్-41శాతం లాభం
షెమారూ ఎంటర్‌టైన్‌మెంట్ -24శాతం
దీపక్ స్పిన్నర్స్-22శాతం
రామా ఫాస్ఫేట్స్-15శాతం
ఆర్ఎస్‌డబ్ల్యూఎం-RSWM-12శాతం
ఏరీస్ ఆగ్రో-11శాతం లాభం
1.డాలీఖన్నా
డాలీఖన్నా జూన్ త్రైమాసికంలో పెట్టుబడి పెట్టిన 7 స్టాక్స్ అన్నీ లాభం పంచినవే. అందులో పాలిప్లెక్స్ 21శాతం పెరిగింది. ఈ కంపెనీలో ఆమె రూ.54 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది. నితిన్ స్పిన్నర్స్ డాలీఖన్నాకి 41శాతం లాభం పంచింది. ఈ కంపెనీలో ఆమె జూన్ క్వార్టర్ లో ఏకంగా 1.2శాతం వాటా కొనుగోలు చేసింది. షెమారూ 24 శాతం, దీపక్ స్పిన్నర్స్ 22శాతం ఈ 3 నెలలకాలంలో డాలీఖన్నాకి రాబడి తెచ్చిపెట్టగా, రామా ఫాస్ఫేట్స్ 15శాతం రిటన్ఇచ్చింది. ఇక ఆర్ఎస్‌డబ్ల్యూఎం 12శాతం, ఏరీస్ ఆగ్రో 11శాతం లాభం తెచ్చిపెట్టాయి.
2.అనిల్ కుమార్ గోయెల్
అనిల్ కుమార్ గోయెల్‌కు సహర్ స్పిన్నింగ్ మిల్స్-64.79శాతం లాభం తెచ్చిపెట్టింది. డిసిఎం నౌవెల్లే-51శాతం, సల్సార్ టెక్నో ఇంజనీరింగ్-18 నెగటివ్ రిటన్నహర్ స్పిన్నింగ్ మిల్స్ ఏకే గోయల్‌కి ఏకంగా 64 .79శాతం లాభం తెచ్చిపెట్టింది. 3 నెలల్లోనే ఆయన పెట్టుబడి పెట్టిన 32 కోట్లకి మరో 18 కోట్లు వచ్చి పడ్డాయన్నమాట ఏకే గోయల్ జూన్ త్రైమాసికంలో నహర్ స్పిన్నింగ్ మిల్స్‌లో 24శాైతం వాటా కొనుగోలు చేసారు. ఇక డిసిఎం నువ్వెల్లే కూడా 51శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే రూపాయకి అర్ధరూపాయ లాభం. ఐతే సల్సార్ టెక్నో ఇంజనీరింగ్ మాత్రం18శాతం కొన్న రేటు నుంచి పడిపోయి నష్టం చవిచూపించింది. సల్సార్‌లో ఆయన 23 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు.
3.రాకేష్ ఝన్‌ఝన్‌వాలా
రాకేష్ ఝన్‌ఝన్‌వాలాకు జూన్ త్రైమాసికంలో రాకీ భాయ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 16శాతం నష్టం చవిచూడగా సెయిల్ నుంచి 16.4శాతం లాస్ మూటగట్టుకున్నారు. IBHOUSING లో ఆయన పెట్టుబడి పెట్టిన రేటు రూ.260.90 కాగా ప్రస్తుతం రూ.233.05 కి షేరు ధర చేరింది. అలానే సెయిల్‌లో షేరు ధర రూ.109.20కి పడింది ఐబి హోసింగ్ లో 2.2శాతం వాటాని రాకేష్ ఝన్‌ఝన్ వాలా రూ.260 కోట్లకిపైగానే ధనంతో కొనుగోలు చేయగా సోమవారానికి ఆ వేల్యూ రూ.233కోట్లకి పతనమైంది. సెయిల్ లో వాటా 1.4శాతం విలువ సోమవారం రూ.628కోట్లుగా తేలింది
4. ఆశిష్ కచోలియా
అడోర్ వెల్డింగ్ ఒక్క స్టాక్‌ని మాత్రమే జూన్ త్రైమాసికంలో కొనుగోలు చేయగా, ఆ ఒక్క స్టాక్‌లో 1.1శాతం వాటాని దాదాపు 9.90కోట్లకు కొనుగోలు చేయగా సోమవారం అది రూ.10.50 కోట్లకి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com