Honda City Facelift : అల్ట్రా మోడ్రన్ ఫీచర్లు, మైండ్ బ్లోయింగ్ మైలేజ్‌.. సరికొత్త అవతారంలో హోండా సిటీ హవా.

Honda City Facelift : అల్ట్రా మోడ్రన్ ఫీచర్లు, మైండ్ బ్లోయింగ్ మైలేజ్‌.. సరికొత్త అవతారంలో హోండా సిటీ హవా.
X

Honda City Facelift : భారతీయ మిడ్‌సైజ్ సెడాన్ కార్ల మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న హోండా సిటీ మరింత పవర్‌ఫుల్ లుక్‌తో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా.. సరికొత్త అప్‌డేట్స్ , అత్యాధునిక సాంకేతికతతో కూడిన 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.12 లక్షలుగా నిర్ణయించింది. గత 2023 తర్వాత ఈ ఐకానిక్ సెడాన్ కారుకు ఇదే కీలకమైన మేజర్ అప్‌డేట్ కావడం విశేషం. దేశీయ మార్కెట్లో ఇది హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి బలమైన పీర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.

కొత్త 2026 హోండా సిటీలో అత్యంత ప్రధానమైన మార్పు దాని డిజైన్లోనే జరిగింది. కారు ఫ్రంట్ ప్రొఫైల్‌ను కంపెనీ పూర్తిగా మార్చేసి సరికొత్త అగ్రెసివ్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వాటి మధ్యలో అదిరిపోయే హనీకోంబ్ పాటర్న్ గ్రిల్‌ను అమర్చారు. కారుకు మరింత ప్రీమియం టచ్ ఇచ్చేందుకు వీలుగా హెడ్‌లైట్లను కలుపుతూ ఒక అందమైన లైట్ స్ట్రిప్‌ను కూడా జోడించారు. బోనెట్, గ్రిల్ మధ్యలో హోండా కొత్త లోగోను అందంగా సెట్ చేశారు. అలాగే సరికొత్త ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా ట్రయాంగిల్ షేప్ ట్రిమ్స్ ఇవ్వడం వల్ల కారు గతంలో కంటే ఎంతో మోడ్రన్‌గా, స్పోర్టీగా కనిపిస్తోంది.

కారు సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే.. పాత మోడల్ కిల్లర్ బాడీ లైన్స్, సిగ్నేచర్ పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్‌ను అలాగే కొనసాగించారు. అయితే, కారుకు సరికొత్త అందాన్నిచ్చేందుకు సరికొత్త డిజైన్ కలిగిన డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను జత చేశారు. ఇక కారు వెనుక భాగంలో మాత్రం గట్టి మార్పులే చేశారు. బూట్ లిడ్‌పై సరికొత్తగా ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌ను సెట్ చేసి క్లీన్ లుక్ ఇచ్చారు. వీటికి తోడు స్మోక్డ్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, వర్టికల్ రిఫ్లెక్టర్ యూనిట్లు, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ కారు వెనుక రూపాన్ని అద్భుతంగా మార్చేశాయి.

కొత్త హోండా సిటీని కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ఆరు అదిరిపోయే సరికొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటిరాయిడ్ గ్రే మెటాలిక్ రంగులు ఉన్నాయి. ఇక కారు లోపల కేబిన్ లేఅవుట్ పాతదానిలానే ఉన్నప్పటికీ, సెంటర్ కన్సోల్‌లో మునుపటి కంటే పెద్దదైన 10.25 ఇంచుల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది వైర్‌లెస్ ఆండ्रాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

ఈ సెడాన్ కారులో లగ్జరీ ఫీచర్లకు కొరతే లేదు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వేసవిలో చల్లదనాన్నిచ్చే ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, థియేటర్ లాంటి మ్యూజిక్ ఇచ్చే 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఎంబియంట్ లైటింగ్, ఫుట్‌వెల్ లైటింగ్ వంటి అదిరిపోయే హంగులు ఉన్నాయి. సేఫ్టీకి పెద్దపీట వేస్తూ కంపెనీ ఇందులో కారు చుట్టూ ఉన్న పరిసరాలను స్క్రీన్‌పై చూపే 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రమాదాలను ముందే పసిగట్టి కారును ఆపే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది.

2026 హోండా సిటీలో రెండు రకాల ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 121 hp పవర్, 145 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. ఇక మైలేజ్ లవర్స్ కోసం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ (e:HEV) మోడల్‌ను కూడా అందించారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్‌తో ఏకంగా 126 hp పవర్, 253 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 27.26 కిలోమీటర్ల మైండ్ బ్లాకింగ్ మైలేజ్ ఇస్తుందని హోండా గర్వంగా ప్రకటించింది.

హైబ్రిడ్ కార్లు కొనే కస్టమర్లలో ఉండే అపోహలను తొలగించేందుకు హోండా కంపెనీ అదిరిపోయే వారంటీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఇచ్చే లిథియం-అయాన్ బ్యాటరీపై ఏకంగా 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. అంతేకాకుండా, దేశంలోనే మొదటిసారిగా హైబ్రిడ్ సిస్టమ్‌లోని ఇతర భాగాలపై కూడా 5 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల సరికొత్త వారంటీని అందిస్తోంది. పెట్రోల్ మోడల్ SV, V, ZX, ZX+ వేరియంట్లలో లభిస్తుండగా, హైబ్రిడ్ మోడల్ మాత్రం కేవలం టాప్ ఎండ్ ZX+ వేరియంట్లోనే లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్‌షిప్‌లలో ఈ కారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా కారును వెంటనే డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

Tags

Next Story