Isuzu V-Cross : కొండలైనా, గుట్టలైనా తగ్గేదేలే.. ఇసుజు కొత్త పిక్-అప్ ఎస్‌యూవీ అదిరిపోయింది.

Isuzu V-Cross : కొండలైనా, గుట్టలైనా తగ్గేదేలే.. ఇసుజు కొత్త పిక్-అప్ ఎస్‌యూవీ అదిరిపోయింది.
X

Isuzu V-Cross : ఆఫ్ రోడింగ్ అంటే ప్రాణం ఇచ్చే అడ్వెంచర్ ప్రేమికుల కోసం జపాన్ దిగ్గజం ఇసుజు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ పిక్-అప్ ఎస్‌యూవీ V-Cross 2026 మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.25.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈసారి కంపెనీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 4x2 మోడల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి, ఈ కొత్త V-Cross లోని అన్ని వేరియంట్లలో 4x4 సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చేసింది. అంటే మీరు ఏ మోడల్ కొన్నా కొండలు, గుట్టల్లో కూడా దూసుకుపోయే పవర్ మీ సొంతం అన్నమాట. భారత మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారుగా టయోటా హైలక్స్ నిలవనుంది.

లుక్ విషయానికి వస్తే.. 2026 ఇసుజు V-Cross డిజైన్‌లో కీలక మార్పులు చేసింది. ముందు భాగంలో సరికొత్త బంపర్ డిజైన్‌ను జోడించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు బాడీపై క్లాడింగ్ తగ్గించి, బంపర్‌కు బ్లాక్ లిప్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ పాత మోడల్ తరహాలోనే ఉన్నప్పటికీ, స్కిడ్ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం. కొత్తగా 18 ఇంచుల అలాయ్ వీల్స్‌ను అమర్చి, కారు బాడీని చాలా సింపుల్‌గా, క్లీన్‌గా తీర్చిదిద్దింది. వీల్ ఆర్చెస్ వద్ద ఉన్న నలుపు రంగు క్లాడింగ్‌ను తీసేయడం వల్ల కారు మరింత స్లీక్‌గా కనిపిస్తోంది.

ఇక ఇంటీరియర్ చూస్తే టెక్నాలజీ పరంగా భారీ మార్పులే జరిగాయి. గతంలో ఉన్న 9 ఇంచుల స్క్రీన్ స్థానంలో ఇప్పుడు 10.3 ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ వచ్చింది. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉండటం విశేషం. క్యాబిన్ లోపల రంగుల గందరగోళం లేకుండా సింపుల్ ట్రిమ్స్‌తో క్లాసీగా డిజైన్ చేశారు. ప్రయాణికుల వినోదం కోసం 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్, సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్‌ డిసెంట్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవర్‌కు పూర్తి భరోసానిస్తాయి.

ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే.. ఇందులో నమ్మకమైన 1.9 లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కొనసాగించారు. ఇది 161 bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో ఈ కారు లభిస్తుంది. షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై 4WD సిస్టమ్ వల్ల కారును రన్నింగ్‌లో ఉండగానే 4x4 మోడ్‌లోకి మార్చుకోవచ్చు. మొత్తం ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో (సిల్కీ వైట్ పెర్ల్ నుంచి గాలెనా గ్రే వరకు) లభించే ఈ కొత్త V-Cross, ఆఫ్ రోడింగ్ ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Tags

Next Story