Mahindra Thar : ఆఫ్ రోడ్ లవర్స్‌కు పండగే..కొత్త లుక్‌లో వస్తున్న థార్..ఫ్యూజులు ఎగిరిపోయే ఫీచర్స్.

Mahindra Thar : ఆఫ్ రోడ్ లవర్స్‌కు మహీంద్రా అదిరిపోయే వార్త వినిపించింది. తన పాపులర్ ఎస్‌యూవీలైన మహీంద్రా థార్ (3-డోర్), థార్ రాక్స్ (5-డోర్) మోడళ్లను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కార్లు రోడ్ల మీద టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాకు చిక్కాయి. 2026 మధ్యలో లేదా ఏడాది చివరిలో ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త వెర్షన్లలో రాబోయే మార్పులు, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్: కొత్త 2026 థార్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా తన పెద్దన్న థార్ రాక్స్ నుంచి స్ఫూర్తి పొందింది. ముందు భాగంలో సరికొత్త సి-షేప్ ఎల్ఈడి డీఆర్ఎల్స్‌తో కూడిన రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్లు వస్తున్నాయి. గ్రిల్ డిజైన్ కూడా మరింత ఆధునికంగా మారనుంది. 19-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన ఎల్ఈడి టెయిల్ లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
పాత థార్‌లో లేని ఎన్నో సౌకర్యాలు ఈ ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్నాయి. లెవల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, 10.25-ఇంచుల కంప్లీట్ డిజిటల్ డిస్‌ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ పరంగా మహీంద్రా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (152 bhp), 1.5 లీటర్ డీజిల్ (119 bhp), 2.2 లీటర్ డీజిల్ (132 bhp) ఆప్షన్లే కొనసాగుతాయి. అయితే, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా ఇచ్చే ఆలోచనలో కంపెనీ ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ ఫేస్‌లిఫ్ట్: థార్ రాక్స్ మార్కెట్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా, 2026 నాటికి ఇందులో కూడా చిన్నపాటి మార్పులు చేయాలని మహీంద్రా భావిస్తోంది. దీనిలో కొత్తగా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల కారు ధర సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 10.2-ఇంచుల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీల కెమెరా, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అలాగే కొనసాగుతాయి. ఇంటీరియర్ కలర్ థీమ్, సీట్ అప్‌హోల్స్టరీలో కొత్త రంగులను మనం చూడవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

