Nissan Magnite : నిస్సాన్ అల్టిమేట్ ఆఫర్..రూ.6.89 లక్షలకే సీఎన్జీ కారు..ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Nissan Magnite : భారతీయ మార్కెట్లో తక్కువ ధరకే ఎస్‌యూవీ అనుభూతిని అందించే కార్లలో నిస్సాన్ మాగ్నైట్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తూ, నిస్సాన్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్‌లో సరికొత్త సీఎన్జీ ఏఎంటీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.6.89 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు, అటు మైలేజ్.. ఇటు కంఫర్ట్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి. ముఖ్యంగా సిటీలో గేర్లు మార్చే ఇబ్బంది లేకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ సీఎన్జీ ఏఎంటీ వెర్షన్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ విజియా ధర రూ.6.89 లక్షలు కాగా, అసెంటా రూ.7.89 లక్షలు, ఎన్-కనెక్టా రూ. 8.51 లక్షలు, టెక్నా రూ. 9.38 లక్షలు, టెక్నా ప్లస్ రూ.9.70 లక్షలు ఈ సీఎన్జీ కిట్ ఫ్యాక్టరీ ఫిటెడ్ గా వస్తుంది. ఇప్పటికే మాగ్నైట్ వాడుతున్న వారు అధికారిక డీలర్ల వద్ద రూ.72,000 అదనంగా చెల్లించి కూడా ఈ కిట్‌ను అమర్చుకోవచ్చు.
తక్కువ ధరకే వస్తున్నా, ఫీచర్ల విషయంలో నిస్సాన్ ఎక్కడా తగ్గలేదు. కారు లోపల కాపర్, బ్లాక్ కలర్ డ్యూయల్-టోన్ లేఅవుట్ ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది. 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఎండకాలంలో చల్లగా ఉండటానికి వెనుక వైపు ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆకాశం చూడటానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరాను అమర్చారు.
ఈ కారులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 72 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్లలో 1.0 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది, ఇది 100 PS పవర్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే నిస్సాన్ అదిరిపోయే లెక్కలు చెబుతోంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ లీటరుకు 19.4 కి.మీ, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 19.7 కి.మీ, టర్బో పెట్రోల్ 20.0 కి.మీ, టర్బో పెట్రోల్ 17.4 కి.మీ సీఎన్జీ వేరియంట్లలో కూడా దాదాపు 25 కి.మీ పైగా మైలేజ్ వస్తుందని అంచనా.
నిస్సాన్ మాగ్నైట్ నేరుగా మారుతి బ్రెజా, టాటా నెక్షాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో తలపడుతోంది. అయితే ఆ కార్ల ధరలతో పోలిస్తే, మాగ్నైట్ సీఎన్జీ ఏఎంటీ చాలా తక్కువ ధరకే లభిస్తుండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. బడ్జెట్ లో ఎస్‌యూవీ లుక్, సీఎన్జీ పొదుపు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌలభ్యం కోరుకునే వారికి ఈ కారు బెస్ట్ ఛాయిస్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

