Tata Punch : సీఎన్జీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్..అదిరిపోయిన 2026 టాటా పంచ్ ఫీచర్లు.

Tata Punch : టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ను భారీ మార్పులతో మళ్ళీ మార్కెట్లోకి తెచ్చింది. 2026 మోడల్ టాటా పంచ్ ఇప్పుడు కేవలం ధరలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా ప్రీమియం కార్లకు గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా, భారత్ ఎన్‌కాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ కారుకు ఉన్న అతిపెద్ద బలం. కొత్త పంచ్‌లో వచ్చిన ఆ 5 ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సీఎన్జీలో తొలిసారి ఆటోమేటిక్ గేర్‌బాక్స్: భారతదేశంలోనే సీఎన్జీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించిన మొదటి ఎస్‌యూవీగా టాటా పంచ్ రికార్డు సృష్టించింది. ఇదివరకు సీఎన్జీ కార్లలో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు సిటీ ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే పని లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. ఇది ప్యూర్+, అడ్వెంచర్, అకాంప్లిష్డ్+ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
2. లుక్ పూర్తిగా మారిపోయింది: కొత్త పంచ్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పోలి ఉంది. సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్స్, కొత్త ఫ్రంట్ గ్రిల్, మరింత దూకుడుగా కనిపించే బంపర్ దీనికి మోడ్రన్ లుక్ ఇచ్చాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తున్నాయి.
3. పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్: స్పీడ్ కోరుకునే వారి కోసం టాటా ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 118 bhp పవర్‌ను, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది. పవర్ఫుల్ ఇంజిన్ కోరుకునే వారు ఈ అడ్వెంచర్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.
4. అదిరిపోయే ఇంటీరియర్: కారు లోపలి భాగం ఇప్పుడు చాలా విలాసవంతంగా ఉంది. నెక్సాన్ తరహాలో రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, దాని మధ్యలో వెలిగే టాటా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ కారును లోపల కూడా హైటెక్‌గా మార్చేశాయి.
5. సేఫ్టీ, మరిన్ని ఫీచర్లు: సేఫ్టీకి పెద్దపీట వేస్తూ టాటా ఈసారి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇచ్చింది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో మొదలై, టాప్ మోడల్ రూ.10.54 లక్షల వరకు అందుబాటులో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

