Tata Punch : మినీ ఎస్‌యూవీలో టర్బో పవర్..కొత్త ఫేస్‌లిఫ్ట్ రేట్లు చూస్తే మతిపోవాల్సిందే.

Tata Punch : మినీ ఎస్‌యూవీలో టర్బో పవర్..కొత్త ఫేస్‌లిఫ్ట్ రేట్లు చూస్తే మతిపోవాల్సిందే.
X

Tata Punch : టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ పంచ్‎ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి వదిలింది. 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, మోడ్రన్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెర్షన్ ధర రూ.5.59 లక్షల నుండి రూ.10.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అయితే ఈ కారులో ఏకంగా 8 రకాల వేరియంట్లు ఉండటంతో.. కస్టమర్లు ఏది కొనాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మీ బడ్జెట్‌కు ఏది కరెక్ట్? ఏ వేరియంట్ కొంటే మీ పైసా వసూల్ అవుతుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లో లుక్ మాత్రమే కాదు, ఇంజిన్ పరంగా కూడా పెద్ద మార్పులే జరిగాయి. ఈసారి టాటా మోటార్స్ 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ను పరిచయం చేసింది. ఇది పవర్‌ఫుల్ డ్రైవింగ్ ఇష్టపడే వారికి వరంగా మారనుంది. దీనికి తోడు 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. మైలేజ్ కావాలనుకునే వారి కోసం ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన సిఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT, కొత్తగా టర్బో ఇంజిన్ కోసం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇచ్చారు.

మీరు పెట్టిన ప్రతి రూపాయికి విలువ దక్కాలి అంటే.. అకంప్లిష్‌డ్+ ఎస్ వేరియంట్ అత్యుత్తమ ఎంపిక అని చెప్పాలి. ఇది టాప్-ఎండ్ ట్రిమ్ అయినప్పటికీ, ఇందులో ఉన్న ఫీచర్లు, వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లు దీనిని బెస్ట్ వాల్యూ ఫర్ మనీగా మారుస్తున్నాయి. దీని ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్‌లో సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా టర్బో ఇంజిన్ కావాలనుకుంటే రూ.9.79 లక్షలకే ఈ టాప్ వేరియంట్ సొంతం చేసుకోవచ్చు.

ఈ కారు స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్‌డ్ వంటి ఎనిమిది ట్రిమ్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ స్మార్ట్ కేవలం రూ.5.59 లక్షలకే లభిస్తుండగా, బడ్జెట్ లో మంచి ఫీచర్లు కావాలనుకునే వారు అడ్వెంచర్(రూ.7.59 లక్షలు) వేరియంట్ వైపు మొగ్గు చూపవచ్చు. సిఎన్‌జీలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ (AMT) కావాలనుకుంటే అకంప్లిష్‌డ్+ ఎస్ మోడల్ రూ.10.54 లక్షల ధర పలుకుతోంది. మీరు సిటీలో తిరగడానికి కంఫర్ట్ కావాలంటే AMT, లాంగ్ రైడ్స్ కోసం పవర్ కావాలంటే టర్బో పెట్రోల్ వేరియంట్లను ఎంచుకోవచ్చు.

Tags

Next Story