5G Spectrum: ముగిసిన 5జీ వేలం ప్రక్రియ.. జియోదే మొదటి స్థానం..

5G Spectrum: ముగిసిన 5జీ వేలం ప్రక్రియ.. జియోదే మొదటి స్థానం..
5G Spectrum: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ ముగిసింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది.

5G Spectrum: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ ముగిసింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. తర్వాతి స్థానాల్లో మరో టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ నిలిచాయి. ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌ కోసం వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్‌ 26 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. జియో, ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా సేవలందించేందుకు స్పెక్ట్రమ్‌ దక్కించుకోగా.. వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. జులై 26న ప్రారంభమైన ఈ 5జీ వేలం ప్రక్రియ చివరి రోజు నాలుగు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. అయితే.. ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో వేలం డేటా మొత్తం సేకరించాక వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story