Upcoming SUVs : ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. త్వరలో మార్కెట్లోకి 7 కొత్త కాంపాక్ట్ కార్లు.

Upcoming SUVs : ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. త్వరలో మార్కెట్లోకి 7 కొత్త కాంపాక్ట్ కార్లు.
X

Upcoming SUVs : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవానే నడుస్తోంది. మరీ ముఖ్యంగా 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, కియా వంటి దిగ్గజ కంపెనీలు తమ కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే భారత రోడ్లపై సందడి చేయబోతున్న ఆ 7 అదిరిపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీల వివరాలు చూద్దాం.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ : టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ సరికొత్త అవతారంలో రాబోతోంది. జనవరి 13న దీనిని లాంచ్ చేయనున్నారు. కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, 360-డిగ్రీ కెమెరాతో ఇది కస్టమర్లను ఆకట్టుకోనుంది. లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, అడాస్ (ADAS) ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది.

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్: మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీ బ్రెజ్జాను అప్‌డేట్ చేస్తోంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారులో ఎక్స్‌టీరియర్ మార్పులతో పాటు లోపల లెవల్-2 అడాస్ (ADAS) వంటి హైటెక్ ఫీచర్లు రానున్నాయి. సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా మారుతి ఈసారి బ్రెజ్జాను మరింత పటిష్టంగా తయారు చేస్తోంది.

మహీంద్రా విజన్ ఎస్: మహీంద్రా నుంచి వస్తున్న సరికొత్త బాక్సీ డిజైన్ ఎస్‌యూవీ ఇది. దీనిని స్కోర్పియో సిరీస్ కింద ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సౌకర్యం కూడా ఉండే ఛాన్స్ ఉంది. గరుడ లాంటి లుక్ తో ఇది యువతను ఆకట్టుకోనుంది.

టాటా నెక్సాన్ న్యూ జనరేషన్: ప్రస్తుతం నెక్సాన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ దీని తదుపరి తరం మోడల్ పై అప్పుడే పని మొదలుపెట్టింది. గరుడ అనే కోడ్ నేమ్ తో తయారవుతున్న ఈ కారులో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఇది 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కియా సైరోస్ ఈవీ : ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కియా తన సత్తా చాటేందుకు సైరోస్ ఈవీని సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మధ్యలో ఇది విడుదల కానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

మహీంద్రా XUV 3XO EV: మహీంద్రా తన పాపులర్ 3XO మోడల్ లో ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇది పాత XUV400 EV స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు (34.5 kWh, 39.4 kWh) ఉండనున్నాయి. ఇది కూడా సింగిల్ ఛార్జ్ తో 400 కిమీ రేంజ్ ఇచ్చేలా డిజైన్ చేశారు.

Tags

Next Story