Aadhaar : అలర్ట్ ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు పెరిగాయి.. ఎప్పటి వరకు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చంటే ?

Aadhaar : అలర్ట్ ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు పెరిగాయి.. ఎప్పటి వరకు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చంటే ?
X

Aadhaar : ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయించుకోవాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI), ఆధార్ సేవలకు సంబంధించిన ఛార్జీలను పెంచింది. ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 30, 2028 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఆ తర్వాత, 2028 నుండి 2031 వరకు మరోసారి ధరలు పెరుగుతాయి. గతంలో రూ.50 లేదా రూ.100 ఉన్న సేవలకు, ఇప్పుడు కస్టమర్లు వరుసగా రూ.75, రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్‌లో మీ వివరాలను అప్‌డేట్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు పెరిగింది. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి జనాభా సంబంధిత వివరాలను అప్‌డేట్ చేయడానికి గతంలో రూ.50 తీసుకునేవారు, ఇప్పుడు రూ.75 చెల్లించాలి. వేలిముద్రలు, కనుపాప లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్‌కు గతంలో రూ.100 ఉండేది, ఇప్పుడు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 2025 నుండి సెప్టెంబర్ 2028 వరకు అమల్లో ఉంటాయి.

యూఐడీఏఐ కొన్ని వయసుల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌లో మినహాయింపు ఇచ్చింది. 5 నుండి 7 ఏళ్లు, 15 నుండి 17 ఏళ్ల వయసులోని పిల్లలు/యువకులకు ఒకసారి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం. 7 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం, సెప్టెంబర్ 30, 2026 వరకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేశారు. ఈ చర్యలు సకాలంలో అప్‌డేట్‌లను ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి.

మీరు మీ ఆధార్‌లో చిరునామా లేదా ఇతర డాక్యుమెంట్ల వివరాలను ఆన్‌లైన్ (myAadhaar పోర్టల్) ద్వారా అప్‌డేట్ చేస్తే, జూన్ 14, 2026 వరకు ఈ సర్వీసు పూర్తిగా ఉచితం. అయితే, ఇదే అప్‌డేట్‌ను మీరు ఆధార్ సేవా కేంద్రంలో చేయించుకుంటే, ఇప్పుడు రూ.50 కి బదులు రూ.75 చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది.

Tags

Next Story