Adani Group : ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన

Adani Group : ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన
X

అదానీ గ్రూప్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీలు.. ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణల పై అదానీ గ్రూప్కు చెందిన గ్రీన్ ఎనర్జీ రియాక్ట్ అయింది. ఇందులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్లపై కేసు నమోదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్ పై సెక్యూరిటీస్ కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ఎఫ్సీపీఏ చట్టం ఉల్లంఘించారంటూ అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్ ప్రస్తావన లేదని అదానీ గ్రూప్ తెలిపింది.

Tags

Next Story