Affordable EV: పెట్రోల్ బడ్జెట్‌తో టాటా ఈవీ కొనేయొచ్చు..మార్కెట్‌లో అత్యంత చవకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు ఇదే.

Affordable EV: పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనం వైపు మారాలని యోచిస్తున్నట్లయితే, మార్కెట్‌లో ప్రస్తుతం అత్యంత చవకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ అందుబాటులో ఉంది. తన సేఫ్టీ, క్వాలిటీకి పేరుగాంచిన టాటా మోటార్స్, రూ. 10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో ఈ కారును అందిస్తోంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.7 లక్షల 99 వేలు నుండి ప్రారంభమవుతుంది (బేస్ వేరియంట్). టాప్ వేరియంట్ ధర సుమారు రూ.11 లక్షల 14 వేలు వరకు ఉంటుంది. ఈ డిసెంబర్‌లో కంపెనీ ఈ కారుపై ఏకంగా రూ.లక్ష 30 వేల వరకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఎంజీ కామెట్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి కార్లు దీనికి పోటీగా ఉన్నాయి.
టాటా అధికారిక సైట్ అందించిన సమాచారం ప్రకారం, టియాగో ఈవీ రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. 19.2kWh బ్యాటరీ ప్యాక్, సింగిల్ ఛార్జ్‌పై 223 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. 24kWh బ్యాటరీ ప్యాక్, సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 293 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. పవర్, వేగం విషయానికి వస్తే ఈ కారు కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ శక్తి సామర్థ్యాలు, పట్టణ, నగర ప్రయాణాలకు టియాగో ఈవీని అద్భుతమైన ఆప్షన్ గా నిలుపుతున్నాయి.
టాటా టియాగో ఈవీలో బడ్జెట్ ధరలో కూడా అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు అందించారు. కంఫర్ట్, టెక్నాలజీ పరంగా చూస్తే ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ముందు భాగంలో USB టైప్-సి ఛార్జర్ (45 వాట్), క్రూయిజ్ కంట్రోల్, పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM, 240 లీటర్ల బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి.
సేఫ్టీకి టాటా ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్, డిఫాగర్, ISOFIX, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కలిసి డ్రైవింగ్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

