Airtel : ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఫ్రీగా స్పామ్‌ డిటెక్షన్‌ సదపాయం

Airtel : ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఫ్రీగా స్పామ్‌ డిటెక్షన్‌ సదపాయం
X

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ దేశపు మొట్టమొదటి నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ పద్ధతిని ప్రారంభించింది. ఈ కొత్త స్పామ్ డిటెక్షన్ అనేది టెలికం కస్టమర్‌లకు స్పామ్ కాల్స్, అనవసరమైన కమ్యూనికేషన్ సమస్యను నివారించేందుకు ఏఐని ఉపయోగిస్తుంది. దేశంలోని టెలికాం ప్రొవైడర్ నుంచి మార్గదర్శక పరిష్కారంగా ఈ టూల్ అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ గురించి వినియోగదారులకు రియల్ టైమ్‌లోనే తెలియజేస్తుంది. అనవసరమైన కమ్యూనికేషన్ నుంచి మెరుగైన ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ సొలుష్యన్ ఫ్రీ ఎయిర్‌టెల్ కస్టమర్‌లందరికీ సర్వీస్ రిక్వెస్ట్‌ లేకుండానే లేదా యాప్‌ని డౌన్‌లోడ్ చేయకుండానే ఆటో-యాక్టివేట్ అవుతుంది. భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. గత పన్నెండు నెలలుగా దీన్ని సమగ్రంగా పరిష్కరించాం. దేశంలోని మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కస్టమర్‌లను అనుచిత అవాంఛిత కమ్యూనికేషన్‌ల నుంచి రక్షిస్తుంది అని పేర్కొన్నారు.

Tags

Next Story