Airtel Rs.199 Plan : డేటా, కాలింగ్‌తో పాటు AI సర్వీసులు ఫ్రీ.. రూ.199కే ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్.

Airtel Rs.199 Plan : డేటా, కాలింగ్‌తో పాటు AI సర్వీసులు ఫ్రీ.. రూ.199కే ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్.
X

Airtel Rs.199 Plan : మీరు రూ.200లోపు మంచి 28 రోజుల వాలిడిటీ ఉన్న ఎయిర్‌టెల్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం ఒక తక్కువ ధర ప్లాన్ తీసుకొచ్చింది. దీనిలో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాదు... ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ రూ.199 ప్లాన్ వివరాలు ఏంటి? అలాగే, దీనికి పోటీగా ఉన్న జియో ప్లాన్ ఎలా ఉంది? అనే విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

మీరు ఎక్కువ డేటా కంటే ఎక్కువ వాలిడిటీ కోరుకుంటే ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ మీకు బాగా నచ్చుతుంది. ఈ ప్లాన్‌తో మీకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, మొత్తం ప్లాన్ కాలానికి 2 జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. అంటే ఇది డేటా తక్కువగా ఉపయోగించే వారికి లేదా కేవలం వాలిడిటీ, కాలింగ్ అవసరం ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్.

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో కేవలం మొబైల్ సేవలే కాకుండా అదనంగా కొన్ని అద్భుతమైన బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఇందులో ఒకటి స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల నుంచి రక్షణ ఇచ్చే అలర్ట్ సర్వీస్. అలాగే, యూజర్లు ఒకసారి ఉచితంగా హలోట్యూన్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ ప్లాన్ ద్వారా కోట్లాది మంది యూజర్లకు ఏకంగా 12 నెలల పాటు రూ.17,000 విలువైన Perplexity Pro AI బెనిఫిట్‌ను ఉచితంగా అందిస్తోంది. నేటి ఏఐ యుగంలో, ఇలాంటి ఖరీదైన సేవను ఇంత తక్కువ ధర ప్లాన్‌లో ఉచితంగా అందించడం నిజంగా ఆశ్చర్యకరం.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌కు పోటీగా రిలయన్స్ జియో దగ్గర రూ.199 ప్లాన్ లేకపోయినా, రూ.198 ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే, ఈ రెండు ప్లాన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం వాలిడిటీలో ఉంది.

ఎయిర్‌టెల్ రూ.199: 28 రోజుల వాలిడిటీ, మొత్తం 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, AI బెనిఫిట్.

జియో రూ.198: కేవలం 14 రోజుల వాలిడిటీ, కానీ ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా (మొత్తం 28 జీబీ), అన్‌లిమిటెడ్ కాలింగ్.

ఎక్కువ డేటా అవసరం ఉన్న వారికి జియో రూ.198 ప్లాన్ మంచిది కావచ్చు. కానీ, తక్కువ ధరలో ఎక్కువ కాలం వాలిడిటీ, కాలింగ్, AI సర్వీసులు కోరుకునే వారికి మాత్రం ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ అత్యంత మెరుగైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Tags

Next Story