All-New Toyota Fortuner 2026 : ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్లీ తుఫాన్ సృష్టించబోతున్న టయోటా!

All-New Toyota Fortuner 2026 : ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్లీ తుఫాన్ సృష్టించబోతున్న టయోటా!
X

All-New Toyota Fortuner 2026 : ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న టయోటా ఫార్చ్యూనర్ కొత్త అవతార్‌లో రాబోతోంది. కొత్త తరం ఆల్-న్యూ ఫార్చ్యూనర్ 2026 రాకకు ముందే మార్కెట్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. దీని డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు ఉండబోతున్నాయని, ముఖ్యంగా ఇది కొత్తగా వచ్చిన మహీంద్రా స్కార్పియో ఎన్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

టయోటా నుంచి రాబోయే ఆల్-న్యూ ఫార్చ్యూనర్ 2026 అనేది అత్యధికంగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. ఇది ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన నెక్స్ట్ జనరేషన్ టయోటా హిల్క్స్ పికప్ ట్రక్కుతో డిజైన్, ఫీచర్లలో చాలా సారూప్యతలను కలిగి ఉండనుంది.

కొత్త ఫార్చ్యూనర్ కూడా హిల్క్స్ లాగా కొత్తగా డిజైన్ చేయబడిన గ్రిల్, సన్నటి LED DRLs తో కూడిన హెడ్‌ల్యాంప్‌లు, స్కిడ్ ప్లేట్‌తో అప్‌డేట్ చేసిన ముందు, వెనుక బంపర్‌లతో సహా అనేక డిజైన్ అంశాలను పంచుకునే అవకాశం ఉంది. మొత్తం డిజైన్ టయోటా రొబస్ట్ సింప్లిసిటీ విధానాన్ని అనుసరించింది. ఇంటీరియర్, టెక్నికల్ అంశాలలో 2026 ఫార్చ్యూనర్ భారీ మార్పులు చూసే అవకాశం ఉంది.

ఎస్‌యూవీ లోపల పెద్ద, ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కొత్త తరం సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇస్తుంది.

ఈసారి ఫార్చ్యూనర్లో పనోరమిక్ వ్యూ మానిటర్, టయోటా సేఫ్టీ సెన్స్ 3 ADAS సూట్, మల్టీ-టెరైన్ మానిటర్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త తరం మోడల్ అయినప్పటికీ, ఫార్చ్యూనర్ 2026లో ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 204PS పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా కొనసాగవచ్చు. ఇది 166PS పవర్, 245Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో రియర్-వీల్-డ్రైవ్ (RWD), ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

Tags

Next Story