Amazon : సెల్లర్స్ కు అమెజాన్ బంపర్ ఆఫర్

Amazon : సెల్లర్స్ కు అమెజాన్ బంపర్ ఆఫర్
X

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వేదికపై విక్రయించే 135 కేటగిరీలకు చెందిన ఉత్పత్తులపై సెల్లర్ ఫీజును రద్దు చేసింది. ఈ కేటగిరిల్లోని 300 రూపాయల కంటే తక్కువ విలువ కలిగిన 1.2 కోట్ల ఉత్పత్తులపై ఈ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు వీటికి అమెజాన్ కేటగిరిని బట్టి 2 నుంచి 16శాతం వరకు ఈ ఫీజును వసూలు చేసింది. దీంతో పాటు వెయిట్ హ్యాండ్లింగ్, షిప్పింగ్ ఛార్జీలను కూడా అమెజాన్ తగ్గించింది. ఈజీ షిప్, సెల్లర్ ఫ్లెక్సీ వంటి ఇతర పులిల్మెంట్ ఛానెల్స్ ద్వారా చేసే షిప్పింగ్ రేట్లను 77 రూపాయల నుంచి 65 కి తగ్గించింది. వెయిట్ హ్యాండ్లింగ్ ఫీజను కేజీకి 17 రూపాయల వరకు తగ్గించింది.

సెల్లర్ ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ వస్తువు లను షిప్పింగ్ చేసినప్పుడు రెండో వస్తువుపై 90 శాతం మేర సెల్లింగ్ ఫీజును ఆదా చేసుకోవచ్చని ఆమెజాన్ తెలిపింది. కొత్త ఫీజు విధానంలో రెండు కొంటే 10 శాతం తగ్గింపు వంటి ఆఫర్లను ప్రకటించడం ద్వారా సెల్లర్లు ఎక్కువ ఆదా చేసుకోవడం వీలుపడుతుందని అమెజాన్ తెలిపింది. తక్కువ ధరకు, మరిన్ని ఉత్పత్తులను విక్రయించుకోవ డానికి వీలుగా తమ వేదికను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఫీజు విధానంలో మార్పులు చేపట్టినట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమిత్ నందా తెలిపారు. చిన్న విక్రేతలకు ఇది ఉపయోగకరంగా ఉంటుం దని చెప్పారు. 2024 సెప్టెంబర్లో 59 రకాల ఉత్పత్తులపై సెల్లర్ ఫీజును 3 నుంచి 12 శాతం వరకు తగ్గించింది.

Tags

Next Story