Amazon : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసింది..టాబ్లెట్లపై భారీ తగ్గింపు.. డీల్స్ ఇవే!

Amazon : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసింది..టాబ్లెట్లపై భారీ తగ్గింపు.. డీల్స్ ఇవే!
X

Amazon : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన కస్టమర్ల కోసం గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026ను ప్రకటించింది. ప్రతి ఏటా జనవరిలో వచ్చే ఈ భారీ సేల్‌లో ఈసారి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసు పని చేసేవారు ఎక్కువగా ఇష్టపడే టాబ్లెట్ల విభాగంలో ఊహించని డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. షావోమి, వన్‌ప్లస్ వంటి దిగ్గజ బ్రాండ్ల టాబ్లెట్లు మునుపెన్నడూ లేని ధరలకే లభించనున్నాయి.

షావోమి ప్యాడ్ 7 పై భారీ ఆఫర్

నానో టెక్స్చర్ డిస్ప్లేతో ఆకట్టుకుంటున్న షావోమి ప్యాడ్ 7 పై అమెజాన్ అదిరిపోయే డీల్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 31,999గా ఉన్న ఈ ట్యాబ్ ధర, సేల్‌లో ఏకంగా రూ.25,999కే లభించనుంది. అంటే కస్టమర్లకు నేరుగా రూ.6,000 ఆదా అవుతుంది. తక్కువ ధరలో మంచి డిస్ప్లే,పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది సరైన అవకాశం.

వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ధర ఎంతంటే?

ప్రీమియం ఫీచర్లతో అలరించే వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 కూడా ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. 2.8K రిజల్యూషన్, 12.1 ఇంచుల భారీ డిస్ప్లే, 10050 mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ట్యాబ్ (8GB/256GB వేరియంట్) ధర ప్రస్తుతానికి రూ. 31,999గా ఉంది. అయితే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో దీనిని రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే దీనిపై రూ.2,000 వరకు నేరుగా డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్‌ట్రా సేవింగ్స్

పైన పేర్కొన్న తగ్గింపు ధరలే కాకుండా, కస్టమర్లు అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు పాత ట్యాబ్ లేదా మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

కేవలం టాబ్లెట్లే కాకుండా లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ ఫోన్లపై కూడా అమెజాన్ భారీ ఆఫర్లను మైక్రోసైట్ ద్వారా రివీల్ చేస్తోంది. సేల్ ప్రారంభ తేదీకి ముందే ప్రైమ్ మెంబర్లకు కొన్ని గంటల ముందే యాక్సెస్ లభించే అవకాశం ఉంది. కాబట్టి కొత్త గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారు అమెజాన్ యాప్‌లో విష్ లిస్ట్ సిద్ధం చేసుకోవడం మంచిది.

Tags

Next Story