AMBANI: బ్లూ చిప్ స్టాక్‌తో అంబానీ చరిత్ర

AMBANI: బ్లూ చిప్ స్టాక్‌తో అంబానీ చరిత్ర
X
రూ.500 కోట్ల పెట్టుబడి రూ.10,000 కోట్ల లాభం

ఆర్థిక నిపుణుడిగా ముకేశ్ అంబానీ మరోసారి తన దూరదృష్టిని చాటుకున్నారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున ఆసియా పెయింట్స్‌లో 4.9 శాతం వాటాను కొనుగోలు చేసి అప్పట్లో ₹500 కోట్లు పెట్టుబడి పెట్టిన అంబానీ... ఇప్పుడు దాని విలువ ఏకంగా ₹10,500 కోట్లకు చేరింది. ఇది డివిడెండ్లను పక్కనపెడితే మాత్రమే! వాటి విలువను కలిపితే లాభం 24 రెట్లకు చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రిలయన్స్ ఆసియా పెయింట్స్‌లోని తన వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. గత మూడేళ్లలో ఆసియా పెయింట్స్ షేర్ 25 శాతం క్షీణించగా, బ్లూ చిప్ స్టాక్స్‌లో ఇది అత్యంత పేలవ ప్రదర్శనగా గుర్తించబడుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్ పెయింట్స్’ వంటి పోటీలతో మార్కెట్ షేర్ 59 శాతం నుంచి 52 శాతానికి పడిపోయింది.

అంబానీ తెలివైన వ్యూహం

2025 ఆర్థిక సంవత్సరానికి ఆసియా పెయింట్స్ అభివృద్ధి యథాతథంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మార్జిన్ ఒత్తిళ్లు, డిమాండ్ తగ్గుదల, పెరుగుతున్న పోటీ తదితర అంశాలు సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. CEO అమిత్ సింజిల్ మాట్లాడుతూ.. మార్కెట్ పోటీలను తట్టుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సమయంలో అంబానీ తన వాటాను విక్రయించడం తెలివైన వ్యూహమేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి మంచి స్టాక్‌లలో దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంత ఫలిస్తాయో అర్థం చేసుకోవచ్చు.

అత్యంత సంపన్న కుటుంబం

దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం ముకేశ్ అంబానీది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వపు వ్యాపారాన్ని మరింత విజయ బాటలో నడిపించారు ముఖేష్. ఆసియాలోనే సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అతను చాలా సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు. ముఖేష్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఏదో ఒకటి సాధించి తీరుతానని ఎప్పుడూ తనను తాను నమ్మేవాడు. దాని ఫలితమే నేడు మనందరి ముందుంది. అతను తన ముందుకు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకునేవాడు. దానిని సాధించడానికి కష్టపడటానికి ప్రయత్నించాడు. తన లక్ష్యాలను సాధించాలనే తపన ఆయనకు ఎప్పుడూ ఉండేది. ముకేశ్ అంబానీ టీమ్ వర్క్ ను నమ్ముతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయానికి అతిపెద్ద రహస్యం టీమ్ వర్క్ అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.

Tags

Next Story