Amul : అమూల్‌ టర్నోవర్‌ రూ.59,445 కోట్లు

Amul : అమూల్‌ టర్నోవర్‌ రూ.59,445 కోట్లు
X

అమూల్‌ పేరుతో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(జీసీఎంఎంఎఫ్‌) అంచనాలకు మించి రాణిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.59,445 కోట్ల(7 బిలియన్‌ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు 50వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం అనంతం వెల్లడించింది. అలాగే గ్రూపు టర్నోవర్‌ రూ.80 వేల కోట్లు(10 బిలియన్‌ డాలర్లు)గా నమోదైందని తెలిపింది. 2022-23 ఏడాదికిగాను 72 వేల కోట్లు(9 బిలియన్‌ డాలర్లు) ఆర్జించింది. ప్రపంచంలో అత్యంత బలమైన ఆహార బ్రాండ్‌, బలమైన పాల ఉత్పత్తుల బ్రాండ్‌గా అమూల్‌ ఎదిగింది. రైతులే యజమానిగా ఎదిగిన అమూల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో 36 లక్షల మంది రైతుల నుంచి రోజుకు 300 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. ఈ సందర్భంగా జీసీఎంఎంఎఫ్‌ చైర్మన్‌ శామల్‌భాయ్‌ పటేల్‌ మాట్లాడుతూ..జీసీఎంఎంఎఫ్‌ మరో చారిత్రక మైలురాయికి చేరుకున్నదని, ప్రపంచంలో అత్యంత బలమైన ఆహార పదార్థాల బ్రాండ్‌గా అవతరించిందన్నారు.

Tags

Next Story