APPLE : ఆపిల్ కు షాక్.. సగం వాటా అమ్మేసిన బెర్క్ షైర్ హాత్ వే..!

అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ గైడ్ వారెన్ బఫెట్ షాక్ ఇచ్చారు. ఆయన సారధ్యంలోని బెర్క్ లే షైర్ హాత్వే కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ద్వితీయ త్రైమాసికంలో ఆపిల్ లోని తన వాటాలో సుమారు సగం వాటాను బెర్క్ లే షైర్ హాత్ వే విక్రయించింది.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక శాతం వాటా విక్రయించిన బెర్క్ షైర్ హాత్వే... ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18 శాతం వాటా తగ్గించుకుంది. ప్రస్తుతం 789 మిలియన్ల నుంచి 100 మిలియన్ల షేర్లకు బెర్క్ షైర్ హాత్వే వాటా తగ్గింది. దీంతో ఆపిల్ కంపెనీలో బెర్క్ షైర్ హార్వే వాటా సుమారు 2.6 శాతానికి తగ్గింది.
ఒకానొకప్పుడు ఆపిల్లో వారెన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్వే వాటా దాదాపు సగం ఉండేది. గత త్రైమాసికంలో 135.4 బిలియన్ల డాలర్ల విలువ గల వాటాలు గల బెర్క్ షైర్ హాత్వే వాటా ఇప్పుడు 84.2 శాతానికి తగ్గి పోయింది. గత త్రైమాసికంలో 88 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్న బెర్క్ షైర్ హాత్వే.. భారీగా ఆపిల్ వాటాలు విక్రయించడంతో 277 బిలియన్ డాలర్లకు
పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com