APPLE: యాపిల్ సీవోవోగా భారత సంతతి వ్యక్తి

APPLE: యాపిల్ సీవోవోగా భారత సంతతి వ్యక్తి
X
యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు.. తదుపరి సీవోవోగా సబీహ్ ఖాన్ బాధ్యతలు

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. యాపిల్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్‌ను నియమించింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. ఆ బాధ్యతలను ప్రస్తుత యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబీహ్ ఖాన్ ఈనెల చివరలో స్వీకరించనున్నారు. ఇక డిజైనింగ్‌ టీమ్‌ బాధ్యతలను సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని టెక్‌ పత్రిక ది వెర్జ్‌ వెల్లడించింది.

భారత మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు

జెఫ్ వి­లి­య­మ్స్‌ స్థా­నం­లో బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చ­ను­న్న సబీ­హ్‌ ఖా­న్‌­కు సం­స్థ­లో 30 ఏళ్ల అను­భ­వం ఉంది. గత ఆరే­ళ్లు­గా యా­పి­ల్‌ గ్లో­బె­ల్‌ సప్లై ఛై­న్‌ ఇన్‌­ఛా­ర్జి­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­రు. ఉత్ప­త్తి కా­ర్య­క­లా­పా­ల­నూ పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. సబీ­హ్ ఖా­న్‌ భారత సం­త­తి­కి చెం­ది­నన వ్య­క్తి. ఆయన ఉత్త­ర­ప్ర­దే­శ్‌ మొ­రా­దా­బా­ద్‌ జి­ల్లా­లో 1966వ సం­వ­త్స­రం­లో జన్మిం­చా­రు. అక్క­డే ఫి­ఫ్త్‌ గ్రే­డ్‌ వరకు చదు­వు­కు­న్నా­రు. ఆ తర్వాత సబీ­హ్ ఖాన్ కు­టుం­బం సిం­గ­పూ­ర్‌­కు వలస వె­ళ్లిం­ది. అక్క­డే పా­ఠ­శాల వి­ద్యా­భ్యా­సం ము­గిం­చి అమె­రి­కా­కు వె­ళ్లా­రు. టఫ్ట్స్ యూ­ని­వ­ర్సి­టీ నుం­చి ఎక­నా­మి­క్స్‌, మె­కా­ని­క­ల్‌ ఇం­జి­నీ­రిం­గ్‌­లో బ్యా­చి­ల­ర్స్‌ డి­గ్రీ పూ­ర్తి చే­శా­రు. ఆ తర్వాత రె­న్సె­లా­ర్ పా­లి­టె­క్ని­క్ ఇన్‌­స్టి­ట్యూ­ట్ నుం­చి మె­కా­ని­క­ల్‌ ఇం­జి­నీ­రిం­గ్‌­లో మా­స్ట­ర్స్‌ పట్టా అం­దు­కు­న్నా­రు. తర్వాత జీఈ ప్లా­స్టి­క్స్‌­లో డె­వ­ల­ప్‌­మెం­ట్‌ ఇం­జి­నీ­ర్‌, అకౌం­ట్‌ టె­క్ని­క­ల్‌ లీ­డ­ర్‌­గా వి­ధు­లు ని­ర్వ­హిం­చా­రు.

యాపిల్‌లో సబీహ్ ఖాన్ ప్రస్థానం

1995లో సబీహ్ ఖాన్ ఆయన యాపిల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేశారు. అప్పటి నుంచి యాపిల్ గ్లోబల్ సప్లై చైన్, తయారీ, సేకరణ, లాజిస్టిక్స్, ఉత్పత్తి సరఫరా వంటి కీలక విభాగాలలో పనిచేశారు. గత ఆరేళ్లుగా యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2019 నుంచి యాపిల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అధునాతన తయారీలో కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో, యునైటెడ్ స్టేట్స్‌లో యాపిల్ తయారీ విస్తరణను పర్యవేక్షించడంలో, పర్యావరణ స్థిరత్వ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో సబీహ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈనెల చివరి వారంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సబీహ్ ఖాన్ బాధ్యతలు స్వీకరిస్తారు.

కీలక సమయంలో రంగంలోకి ఖాన్

ప్రస్తుతం యాపిల్‌ తన సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా లిక్విడ్‌ గ్లాస్‌ డిజైన్‌ను సిద్ధం చేస్తోంది. వీటిని ఐఫోన్‌, ఐపాడ్‌, మ్యాక్‌ సహా ఇతర పరికరాల్లో వాడనుంది. ‘లిక్విడ్‌ గ్లాస్‌’ డిజైన్‌తో ఇంటర్‌ఫేస్‌లో పలు మార్పులు రానున్నాయి. బటన్లు, మెనూ, యాప్‌ ఐకాన్స్‌, విడ్జెట్ల మార్పుతో స్క్రీన్‌కు కొత్త లుక్‌ రానుంది. కంపెనీ చరిత్రలో ఇది విస్తృతమైన డిజైన్‌ అప్‌డేట్‌గా యాపిల్‌ ఇప్పటికే ప్రకటించింది.

భారతదేశం యాపిల్‌ సంస్థకు ప్రధాన మార్కెట్‌గా, తయారీ కేంద్రంగా మారుతున్న క్రమంలో సబీహ్ ఖాన్ నియామకం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. గ్లోబల్ సప్లై చైన్, తయారీలో విస్తృతమైన అనుభవం ఉండటం యాపిల్‌కు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకం భవిష్యత్తులో కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సబీహ్ ఖాన్‌ను 'గొప్ప వ్యూహకర్త' అని, ఆపిల్ సప్లై చైన్‌కు కీలక రూపశిల్పి అని స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసించారు.

Tags

Next Story