NPS : పెన్షన్ టెన్షన్ ఇక క్లోజ్..NPSలో రాబోతున్న మార్పులివే.

NPS : పెన్షన్ టెన్షన్ ఇక క్లోజ్..NPSలో రాబోతున్న మార్పులివే.
X

NPS : రిటైర్మెంట్ తర్వాత జీవితం ప్రశాంతంగా గడవాలంటే చేతిలో డబ్బు ఉండాలి. అయితే ప్రస్తుత ఎన్పీఎస్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉండటంతో, కచ్చితంగా ఎంత పెన్షన్ వస్తుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ అనిశ్చితిని తొలగించడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక కీలక అడుగు వేసింది. పెన్షన్ దారులకు కచ్చితమైన పెన్షన్ అందేలా చూడటం కోసం నిపుణులతో కూడిన ఒక హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉన్నా మీకు రావాల్సిన పెన్షన్ మాత్రం గ్యారెంటీగా అందేలా చట్టపరమైన మార్పులు చేయబోతున్నారు.

ఐబీబీఐ మాజీ చీఫ్ డాక్టర్ ఎం.ఎస్.సాహూ నాయకత్వంలో 15 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఆర్థిక, బీమా, న్యాయ రంగాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. వీరు ప్రధానంగా ఒక విషయంపై దృష్టి పెట్టనున్నారు.. అదే అష్యూర్డ్ పెన్షన్. అంటే ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన తర్వాత, తనకు ప్రతి నెలా ఇంత మొత్తం వస్తుందని ముందే ఒక నమ్మకం ఉండాలి. ప్రస్తుతమున్న నిబంధనలను సరళతరం చేస్తూ, పెన్షన్ తీసుకునే ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పారదర్శకమైన విధానాన్ని వీరు రూపొందిస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ప్రతి పౌరుడు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బాధ్యతను కమిటీకి అప్పగించింది.

ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా మిస్-సెల్లింగ్ (అబద్ధాలు చెప్పి పాలసీలు అమ్మడం)కు అడ్డుకట్ట పడుతుంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత వస్తుంది? గ్యారెంటీ ఎంత? మార్కెట్ రిస్క్ ఎంత? అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా, పెన్షన్ ప్లాన్ల ధరలు, సర్వీస్ ఛార్జీలు, టాక్స్ మినహాయింపులపై కూడా ఈ కమిటీ కీలక సిఫార్సులు చేయనుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ప్రైవేట్ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా రిటైర్ అయ్యాక మా పెన్షన్ మాకు గ్యారెంటీ అనే ధీమాను ఈ కొత్త రూల్స్ కల్పించబోతున్నాయి. 2025 సెప్టెంబర్ నాటికే దీనిపై ఒక పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story