Ather : ఓలాకు బిగ్ షాక్..ఏథర్ నుంచి మరింత చౌకైన కొత్త స్కూటర్..డిజైన్ లీక్..2026లో లాంచ్.

Ather : ఓలాకు బిగ్ షాక్..ఏథర్ నుంచి మరింత చౌకైన కొత్త స్కూటర్..డిజైన్ లీక్..2026లో లాంచ్.
X

Ather : భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ ఇప్పటికే తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఫ్యామిలీ సెగ్మెంట్‌పై దృష్టి సారించిన రిజ్తా మోడల్‌తో కంపెనీ అమ్మకాలలో మంచి పురోగతి సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగించడానికి ఏథర్ మరింత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని కోసం కంపెనీ EL01 కాన్సెప్ట్ ఆధారిత కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. త్వరలో రాబోయే ఈ కొత్త EV తో ఏథర్, ఓలా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి, తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఏథర్ ఎల్‌01 కాన్సెప్ట్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఏథర్ కమ్యూనిటీ డే 2025 సందర్భంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగానే కంపెనీ కొత్త EL ప్లాట్‌ఫామ్‎ను కూడా పరిచయం చేసింది. ఆ సమయంలో ఏ EV ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ముందుగా వస్తుందో కంపెనీ స్పష్టంగా చెప్పనప్పటికీ తాజాగా ఈ EL01 స్కూటర్ పేటెంట్ కావడంతో, ఇదే మొదటగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై వచ్చే మోడల్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 లో మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

కాన్సెప్ట్‌గా ప్రదర్శించినప్పటికీ ఏథర్ EL01 ప్రొడక్షన్ కోసం దాదాపు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీని డిజైన్ ప్రధానంగా ఏథర్ రిజ్తాను పోలి ఉంటుంది.. కానీ ఖర్చును తగ్గించే విధంగా కొన్ని ముఖ్యమైన, చిన్న మార్పులు చేశారు. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ముందు భాగం మధ్యలో సన్నని ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, సింగిల్-పీస్ సీటు, పిల్లియన్ బ్యాక్‌రెస్ట్, బాడీ ప్యానెల్స్‌లో వినూత్న డిజైన్ కనిపిస్తాయి. కాన్సెప్ట్‌లో 7.0-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కనిపించింది.మొత్తంగా చూస్తే ఈ EL01 మోడల్ ఏథర్ రిజ్తాకు చౌకైన, సరళమైన వెర్షన్‌లా కనిపిస్తోంది.

ఏథర్ ఎల్‌01 కాన్సెప్ట్‌లో బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చబడింది. ఈ కొత్త ఎల్ ప్లాట్‌ఫామ్ 2 kWh నుంచి 5 kWh వరకు వివిధ రకాల బ్యాటరీ ప్యాక్‌లకు సపోర్ట్ చేసే విధంగా రూపొందించబడింది. అందువల్ల ఈ ప్రొడక్షన్ మోడల్ అనేక బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుందని అంచనా. ఒకే ఛార్జింగ్‌తో ఇది దాదాపు 150 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించే అవకాశం ఉంది. ఇది రోజువారీ ప్రయాణాలకు సరిపోతుంది.

Tags

Next Story