Bajaj Freedom 125 CNG : రూ.90,976 కే 332 కి.మీ మైలేజ్.. మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న చౌక బైక్.

Bajaj Freedom 125 CNG : బైక్ కొనాలని ఉంది కానీ పెట్రోల్ ధరలు, మైలేజ్ గురించి భయపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. బజాజ్ ఆటో సంస్థ రూ.లక్ష లోపు బడ్జెట్‌లో ఒక సరికొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ పేరు బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ కావడం విశేషం. ఈ బైక్ మైలేజ్ ముందు పెట్రోల్ బైక్‌లు వెలవెలబోవాల్సిందే. బజాజ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ బైక్ సాధారణ పెట్రోల్ బైక్‌ల కంటే 50 శాతం తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది. అంటే రన్నింగ్ కాస్ట్ సగానికి తగ్గుతుంది.
ఈ బైక్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి.మైలేజీ వివరాల్లోకి వస్తే.. పెట్రోల్ మీద 130కిమీ, సీఎన్‌జీ మీద 202 కిమీ మైలేజీ ఇస్తుంది. అంటే 2 లీటర్ల పెట్రోల్, 2 కిలోల సీఎన్‌జీతో కలిపి ఈ బైక్ ఏకంగా 332 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో ఉన్న 125 సీసీ ఇంజిన్ 9.4 బీహెచ్‌పీ పవర్, 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బజాజ్ ఆటో కంపెనీ తమ కొత్త సీఎన్‌జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీని మూడు వేర్వేరు వేరియంట్‌లలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో NG04 డ్రమ్ వేరియంట్ అత్యంత సరసమైనదిగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.90,976గా నిర్ణయించబడింది. మీడియం వేరియంట్ అయిన NG04 డ్రమ్ LED ధరరూ.1,03,468గా ఉంది. ఈ మోడల్‌లో LED హెడ్‌ల్యాంప్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. ఇక ఈ బైక్ టాప్-ఎండ్ వేరియంట్ అయిన NG04 డిస్క్ ధర రూ.1,07,026గా ఉంది. ఈ వేరియంట్‌లో మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్ ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా వినియోగదారులు తమ బడ్జెట్‌కు అవసరాలకు తగ్గట్టుగా వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.
125 సీసీ సెగ్మెంట్‌లో ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్.. టీవీఎస్ రైడర్ 125, హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, హీరో గ్లామర్, బజాజ్ పల్సర్ 125 వంటి బైక్‌లతో పోటీ పడుతుంది. అయితే మైలేజ్ విషయంలో మాత్రం ఈ సీఎన్‌జీ బైక్‌ను కొట్టే బైక్ ప్రస్తుతానికి మార్కెట్‌లో లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

