Stock Market : స్టాక్ మార్కెట్ లోకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్

Stock Market : స్టాక్ మార్కెట్ లోకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
X

బజాజ్‌ గ్రూపునకు చెందిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ స్టాక్‌ మార్కెట్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. సోమవారం లిస్టింగ్‌ కు వచ్చిన కంపెనీ షేర్లు 114.29 శాతం ప్రీమియంతో అదరగొట్టాయి. షేరు ఇష్యూ ధర రూ.70 కాగా.. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో రూ.150తో లిస్ట్‌ అయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.07లక్షలకు చేరింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 135.71 శాతం ప్రీమియంతో రూ.165 వద్ద ముగిసింది. గతవారం ముగిసిన ఈ ఐపీవోకు గుడ్ రెస్పాన్స్ దక్కింది. ఇష్యూలో భాగంగా రూ.6,560 కోట్ల విలువైన 72,75,75,756 షేర్లను ఆఫర్‌ చేయగా, 46,27,48,43,832 షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3.8 లక్షల కోట్లు. ఏకంగా 63.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఐపీవోలో భాగంగా రూ.3,560 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయగా.. మరో రూ.3 వేల కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ మాతృ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ అమ్మింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారితో పాటు గృహాలు, కమర్షియల్‌ ప్రాపర్టీల పునరుద్ధరణకు ఈ కంపెనీ లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ ఉంటుంది. 2023–-24 ఏడాదికి బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.1731 కోట్ల నికర లాభం పొందింది. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో రూ.1,258 కోట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Tags

Next Story