Bajaj Pulsar N160 : పల్సర్ ఫ్యాన్స్‌కు పండుగ..కొత్త N160 వచ్చేసింది..సింగిల్ సీటుతో మరింత కంఫర్ట్.

Bajaj Pulsar N160 : పల్సర్ ఫ్యాన్స్‌కు పండుగ..కొత్త N160 వచ్చేసింది..సింగిల్ సీటుతో మరింత కంఫర్ట్.
X

Bajaj Pulsar N160 : భారతీయ మార్కెట్లో పల్సర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బజాజ్ ఆటో సంస్థ పల్సర్ N160 బైక్ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,23,983 గా నిర్ణయించారు. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టాప్-ఎండ్ డ్యుయల్-ఛానల్ USD ఫోర్క్స్ వేరియంట్ (రూ.1,26,290) కంటే తక్కువ ధరలో, డ్యుయల్-ఛానల్ ABS వేరియంట్ (రూ.1,16,773) కంటే కొద్దిగా ఎక్కువ ధరలో ఉంది. ఈ కొత్త మోడల్‌లో లుక్, కంఫర్ట్‌పై బజాజ్ ప్రధానంగా దృష్టి పెట్టింది.

లుక్, డిజైన్‌లో మార్పులు

కొత్త వేరియంట్‌లో బజాజ్ సంస్థ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్‌లో ముఖ్యమైన మార్పులు చేసింది. ముఖ్యంగా బైక్‌కు కొత్త రంగుల అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్‌ ను అందించారు. అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఈ వేరియంట్‌లో స్ప్లిట్ సీట్ డిజైన్‌కు బదులుగా సింగిల్-పీస్ సీట్ ను అమర్చారు. ఇది వెనుక కూర్చున్న వారికి మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. దీనితో పాటు స్ప్లిట్ గ్యాబ్ రెయిల్స్‌కు బదులుగా కొత్త సింగిల్-పీస్ యూనిట్‌ను కూడా అమర్చారు.

కలర్ ఆప్షన్లు, ఫీచర్లు

బజాజ్ ఆటో పల్సర్ N160 కొత్త వేరియంట్‌ను మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.. పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్. ఇక ఫీచర్ల విషయానికి వస్తే పల్సర్ N160 లో నావిగేషన్‌ను చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ABS మోడ్‌లు, LED లైటింగ్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇంజిన్, పర్ఫామెన్స్

బజాజ్ పల్సర్ N160 కొత్త వేరియంట్‌లో మెకానికల్ మార్పులు ఏమీ చేయలేదు. ఇందులో మునుపటి మాదిరిగానే 164.82 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,750 ఆర్‌పిఎం వద్ద 16 PS పవర్, 6,750 ఆర్‌పిఎం వద్ద 14.65 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది.

సింగిల్-పీస్ సీట్ ఎందుకు?

పల్సర్ N160 బైక్ మొదట్లో స్పోర్టీ రైడర్‌లను ఆకర్షించేందుకు స్ప్లిట్-సీట్ లేఅవుట్‌తో వచ్చింది. అయితే బజాజ్ జరిపిన పరిశోధనలో N160 కస్టమర్‌లలో చాలా మంది తమ బైక్‌ను కుటుంబ అవసరాల కోసం లేదా సాధారణ రోజువారీ ప్రయాణాల కోసం ఉపయోగించినట్లు గుర్తించారు. వెనుక సీటులో కూర్చున్న వారికి సులభమైన ప్రయాణం, ఎక్కువ సౌకర్యం కోసం వారు సింగిల్, పొడవైన సీటును ఎక్కువగా కోరుకున్నారు. ఈ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే రోజువారీ సౌలభ్యం కోసం ఈ కొత్త వేరియంట్‌లో సింగిల్-పీస్ సీట్‌ను అందించారు.

Tags

Next Story