Pulsar NS125 : కొత్త పల్సర్ NS125 వస్తుంది.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కించాల్సిందే.

Pulsar NS125 : కొత్త పల్సర్ NS125 వస్తుంది.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కించాల్సిందే.
X

Pulsar NS125 : బజాజ్ త్వరలో తన పాపులర్ బైక్ పల్సర్ NS125కు అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేయబోతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. ఈ అప్‌డేటెడ్ 2026 పల్సర్ NS125 ఇప్పటికే షోరూమ్‌లకు రావడం మొదలైంది. ఈ కొత్త మోడల్ కొన్ని బెటర్ ఫీచర్స్, కొత్త కలర్ ఆప్షన్‌తో వస్తుంది. ముఖ్యంగా స్టైల్, పర్ఫార్మెన్స్ రెండూ కోరుకునే యువ రైడర్లను ఈ బైక్ ఆకట్టుకునేలా ఉంది. పల్సర్ NS125 కొత్త మోడల్‌లో చాలా అప్‌డేట్‌లు చేశారు. డిజైన్ పరంగా చూస్తే, ప్రస్తుత మోడల్ లాగే ఉన్నా, బజాజ్ ఇందులో కొత్త పర్ల్ వైట్ కలర్ ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీనిలో లైట్ పింక్ షేడ్స్ ఉంటాయి. ఈ కొత్త కలర్ బైక్‌కి ఒక ఫ్రెష్, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఈ అప్‌గ్రేడ్‌లలో అతి పెద్ద మార్పు ఏమిటంటే, ఇందులో మూడు సెలెక్టబుల్ ABS మోడ్‌లు వచ్చాయి – అవి రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్. ఈ సిస్టమ్ సింగిల్-ఛానెల్ ABS ద్వారా పనిచేస్తుంది. దీనివల్ల రైడర్ వేర్వేరు రోడ్డు పరిస్థితులకు తగ్గట్టుగా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్‌ను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రెయిన్ మోడ్ వర్షం పడినప్పుడు లేదా తడి రోడ్లపై ఎక్కువ బ్రేకింగ్ అసిస్టెన్స్ ఇస్తుంది. స్కిడ్ అవ్వకుండా సేఫ్‌గా బ్రేక్ వేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆఫ్ రోడ్ మోడ్ మట్టి రోడ్లు, లేదా రఫ్ సర్ఫేస్‌లపై వెళ్లేటప్పుడు బ్రేకింగ్ జోక్యం కొంచెం తగ్గుతుంది. దీనివల్ల లూస్ సర్ఫేస్‌లపై బైక్‌ను కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. రోడ్ మోడ్: ఇది రోజువారీ రైడింగ్ కోసం బ్యాలెన్స్డ్ బ్రేకింగ్ ఇస్తుంది. మామూలు రోడ్లపై చక్కగా పనిచేస్తుంది.

అంతేకాకుండా, బజాజ్ కొత్త పల్సర్ NS125 లో ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చింది. ఇదివరకు ఇది కేవలం టాప్ వేరియంట్‌లలో మాత్రమే ఉండేది. ఈ కొత్త డిస్‌ప్లేలో ఇప్పుడు చాలా ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్, SMS, కాల్ అలర్ట్‌లు, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మోడర్న్‌గా, ఈజీగా చేస్తాయి.

మెకానికల్ పరంగా చూస్తే, ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పల్సర్ NS125 లో అదే 124.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500 RPM వద్ద దాదాపు 12 హార్స్‌పవర్, 7,000 RPM వద్ద 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే పవర్, పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి రాజీ పడలేదు. అయితే, ఈ బైక్ ధర లాంచ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది.

Tags

Next Story