Best Cars Under 5 Lakhs : రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే కార్లు.. తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. టాప్ 5 లిస్ట్ ఇదే.

Best Cars Under 5 Lakhs : మధ్యతరగతి భారతీయులకు కారు కొనడం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అదొక తీరని కల. సొంత కారులో కుటుంబంతో కలిసి ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పెరుగుతున్న కార్ల ధరల మధ్య బడ్జెట్ లో మంచి కారును ఎంచుకోవడం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా రూ.5 లక్షల లోపు బడ్జెట్ పెట్టుకునే వారికి మైలేజీ, ఫీచర్లు, మెయింటెనెన్స్ అన్నీ సరిగ్గా ఉండాలి. అందుకే ఆటోమొబైల్ కంపెనీలు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా, అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
1. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ తరహా ఫీలింగ్ ఇచ్చే కారు కావాలనుకునే వారికి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్. దీనిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 63 bhp పవర్‌ను ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3.49 లక్షల నుంచే మొదలవుతుంది. సిటీ ప్రయాణాలకు ఇది చాలా అనువైనది. దీనిలో కంపెనీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటం వల్ల మైలేజీ గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు.
2. మారుతి సుజుకి ఆల్టో K10
దశాబ్దాలుగా సామాన్యుడి నేస్తంగా ఉన్న ఆల్టో, సరికొత్త K10 రూపంలో ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ గా మారింది. దీని ధర రూ.3.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండటం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. మైలేజీ విషయంలో ఆల్టోను కొట్టే కారు మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
3. రెనాల్ట్ క్విడ్
డిజైన్ పరంగా లగ్జరీ లుక్ ఇచ్చే చిన్న కారు ఏదైనా ఉందంటే అది రెనాల్ట్ క్విడ్ మాత్రమే. దీని ఎస్‌యూవీ తరహా లుక్స్ యూత్‌ను బాగా ఆకర్షిస్తాయి. 1.0 లీటర్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ధర రూ.4.29 లక్షల నుంచి మొదలవుతుంది. దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉండటం విశేషం. ఏఎంటీ (ఆటోమేటిక్) గేర్ బాక్స్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
4. టాటా టియాగో
తక్కువ బడ్జెట్ లోనే బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ కోరుకునే వారికి టాటా టియాగో సరైన ఎంపిక. దీనిలో 1.2 లీటర్ పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ.4.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కారు లోపల స్పేస్ ఎక్కువగా ఉండటమే కాకుండా, మ్యూజిక్ సిస్టమ్, ఇతర ప్రీమియం ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. దీనిలో కూడా సీఎన్‌జీ మోడల్ లభిస్తుంది.
5. మారుతి సుజుకి సెలెరియో
మైలేజీకి మారుపేరుగా నిలిచే సెలెరియో, ఫ్యామిలీ మ్యాన్ కు పర్ఫెక్ట్ కారు. దీనిలో సరికొత్త K10 ఇంజిన్ వాడటం వల్ల లీటరుకు సుమారు 25 కిలోమీటర్ల పైగా మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.69 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కావాలనుకునే వారికి ఇది తక్కువ ధరలో దొరికే మంచి ఆప్షన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
