Electric Bikes : ఇక పెట్రోల్ టెన్షన్ అక్కర్లేదు.. కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకు బెస్ట్ 3 బైక్స్ ఇవే.

Electric Bikes : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బైక్‌లు ఖర్చును తగ్గించడమే కాకుండా, వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ముఖ్యంగా, ఆఫీస్‌కు లేదా రోజూ కాలేజీలకు వెళ్లే వాళ్లకు బడ్జెట్లో మంచి ఆప్షన్లుగా మారాయి. మీ బడ్జెట్ కనుక రూ.లక్షలోపు ఉంటే మీకు ఉపయోగపడే బెస్ట్ 3 ఎలక్ట్రిక్ బైక్స్ గురించి తెలుసుకుందాం.
1. ఓలా రోడ్‌స్టర్ X
ఓలా సంస్థ నుండి వచ్చిన రోడ్‌స్టర్ X బైక్, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ బైక్. దీని బేస్ వేరియంట్ ధర కేవలం రూ.74,999 (ఎక్స్-షోరూమ్). ఇది 2.5 kWh బ్యాటరీని కలిగి ఉంది. అందుకే ప్రస్తుతం దేశంలో అత్యంత చౌకైన ఈ-బైక్‌గా ఉంది. ఈ బైక్ ఏకంగా 252 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. అయితే, సాధారణ ప్రయాణ పరిస్థితుల్లో ఇది ఈజీగా 150 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇది 0 నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి కేవలం 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఇందులో 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
2. ఓబెన్ రోర్ EZ
ఓబెన్ రోర్ EZ బైక్ మంచి లుక్, పవర్‌ను అందిస్తుంది. దీని బేస్ వేరియంట్ (2.6 kWh LFP బ్యాటరీ) ధర రూ.89,999. టాప్ వేరియంట్ ధర రూ.1,19,999 వరకు ఉంటుంది. ఇందులో లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ టెక్నాలజీ బేస్డ్ బ్యాటరీ ఉంది. ఇందులో 7.5 kW మోటార్ ఉంది, ఇది 277 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 95 కి.మీ వరకు చేరుకుంటుంది. దీని టాప్ వేరియంట్ 175 కి.మీ వరకు, సాధారణ పరిస్థితుల్లో సుమారు 140 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇది ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో లభిస్తుంది.
3. మ్యాటర్ ఎరా
అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ మోటార్స్ డెవలప్ చేసిన ఎరా బైక్ కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, ఇది ఒక స్పెషల్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే మొదటి 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్. పెట్రోల్ బైక్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ.1,81,308 నుంచి మొదలవుతుంది. దీని రేంజ్ 125 నుంచి 172 కి.మీ వరకు ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ ఉంటుంది.
మీ బడ్జెట్ రూ.75,000 వరకు ఉండి కేవలం సిటీలో తిరగడానికి బైక్ కావాలంటే, ఓలా రోడ్‌స్టర్ X బెస్ట్ ఆప్షన్. కొంచెం ఎక్కువ పవర్, రేంజ్, ప్రీమియం ఫీచర్లు కావాలంటే ఓబెన్ రోర్ EZ సరిపోతుంది. ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా గేర్ మార్చే ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారికి, మ్యాటర్ ఎరా ఒక ప్రీమియం ఆప్షన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com