Bajaj Platina : ఒక్కసారి ఫుల్ కొట్టిస్తే నెలంతా తిరగొచ్చు..బజాజ్ ప్లాటినా స్పీడ్ కి పెట్రోల్ బంకులు షాక్.

Bajaj Platina : కొత్త ఏడాదిలో కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే బండి కోసం వెతుకుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ ఉంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఏకంగా 770 కిలోమీటర్ల వరకు నాన్-స్టాప్‌గా ప్రయాణించే ఒక అద్భుతమైన బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యతరగతి ప్రజల మెచ్చిన బ్రాండ్ బజాజ్ నుంచి వచ్చిన బజాజ్ ప్లాటినా 100 ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.
బజాజ్ ప్లాటినా 100 బైక్ భారతీయ మార్కెట్లో అత్యంత చౌకైన, నమ్మకమైన మోటార్ సైకిళ్లలో ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.65,407 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఈ తక్కువ ధరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ స్టార్ట్, పొడవైన సీటు, మెరుగైన షాక్ అబ్జార్బర్లు, మంచి గ్రిప్ వంటి ఫీచర్లను అందిస్తోంది. బడ్జెట్ విభాగంలో ఈ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 100, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వంటి హేమాహేమీలతో పోటీపడుతోంది.
ప్లాటినా అంటేనే మైలేజీకి పెట్టింది పేరు. ఆటోమొబైల్ నిపుణుల లెక్కల ప్రకారం.. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉంది. అంటే మీరు ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే దాదాపు 770 కిలోమీటర్ల దూరం అలవోకగా ప్రయాణించవచ్చు. ఊరి నుంచి సిటీకి వెళ్లే వారికి, డెలివరీ బాయ్స్‌కు, ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగులకు ఇది ఒక వరమనే చెప్పాలి.
బజాజ్ ప్లాటినా 100లో కంపెనీ 99.59 సీసీ, 4-స్ట్రోక్, DTS-i సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది 7500rpm వద్ద 8.2PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ బైక్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. డిజైన్ పరంగా కూడా ప్లాటినా కొత్త లుక్‌లో కనిపిస్తోంది. ఇందులో LED DRLలు, కొత్త తరహా రియర్ వ్యూ మిర్రర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ముందు భాగంలో 130mm, వెనుక భాగంలో 110mm డ్రమ్ బ్రేకులతో పాటు యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ను కూడా అందించారు.
కొత్త సంవత్సరంలో ఆర్థికంగా లాభపడాలనుకునే వారికి ప్లాటినా 100 ఒక గొప్ప ఎంపిక. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండటం విశేషం. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం దీని సీటును ప్రత్యేకంగా రూపొందించారు, తద్వారా ఎంత దూరం ప్రయాణించినా వెన్నునొప్పి రాకుండా ఉంటుంది. కలర్ ఆప్షన్లలో కూడా మీకు నచ్చిన రంగును ఎంచుకునే వెసులుబాటు ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

