Second Hand Car : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే ఈ ప్లాన్‌తో మీ డబ్బు ఆదా చేసుకోండి!

Second Hand Car : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే ఈ ప్లాన్‌తో మీ డబ్బు ఆదా చేసుకోండి!
X

Second Hand Car : 2025 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి ఒక వరంలా మారింది. జీఎస్టీ 2.0 పుణ్యమా అని కార్ల ధరలు భారీగా తగ్గడంతో సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే, కొత్త కార్ల ధరలు తగ్గినా సరే, చాలా మందికి బడ్జెట్ అనేది పెద్ద సమస్యగానే ఉంటోంది. అందుకే తక్కువ ధరలో మంచి సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పాత కారు కొనేటప్పుడు జేబు ఖర్చు తగ్గించుకుంటూనే, నాణ్యమైన వాహనాన్ని ఎలా ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో పోటీ విపరీతంగా ఉంది. Cars24 వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని కార్లపై ఏకంగా రూ.1.8 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా లైఫ్‌టైమ్ వారంటీ, ఇన్స్టంట్ ఫైనాన్స్ వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఇక Spinnyలో అయితే రూ.5 లక్షల లోపు కార్లపై తక్కువ వడ్డీ రేటుతో ఈజీ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఇవే కాకుండా మారుతి సుజుకికి చెందిన True Value, మహీంద్రాకు చెందిన First Choiceలలో కూడా నమ్మకమైన కండిషన్ ఉన్న కార్లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

పాత కారు కొనేటప్పుడు కేవలం బాడీ షైనింగ్ చూసి మోసపోకూడదు. ముందుగా మీ బడ్జెట్ ఎంతో ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కారు సర్వీస్ హిస్టరీ, ఓడోమీటర్ రీడింగ్ (ఎన్ని కిలోమీటర్లు తిరిగింది), గతంలో ఎంతమంది యజమానులు మారారు అనే వివరాలు ఖచ్చితంగా తనిఖీ చేయాలి. వీలైతే ఒక నిపుణుడైన మెకానిక్‌ను తీసుకెళ్లి ఇంజిన్ కండిషన్, బ్రేక్స్, క్లచ్, సస్పెన్షన్ తనిఖీ చేయించడం ఉత్తమం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రిపేర్ ఖర్చులను ముందే ఆదా చేసుకోవచ్చు.

కారు కండిషన్ బాగుంటే సరిపోదు, దాని కాగితాలు కూడా పక్కాగా ఉండాలి. ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్, ఇన్సూరెన్స్ మీ పేరు మీదకు మార్చుకోవడం, ఎలాంటి బకాయిలు లేవని తెలిపే నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ ఆ కారు గతంలో లోన్ మీద ఉంటే, సంబంధిత బ్యాంకు నుండి ఎన్‌ఓసీ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కొత్త ఏడాదిలో తక్కువ ఖర్చుతో ఒక సూపర్ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Tags

Next Story