ఏపీలో జియోకి సాయపడనున్న ఎయిర్‌టెల్

టెల్కో కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ యూజర్ల పరంగా వ్యాపారపరంగా ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే, అయితే ఎయిర్‌టెల్ తనకి కేటాయించిన 800మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ని మూడు సర్కిల్స్‌లో జియోకి బదిలీ చేయబోతోంది. ఇది ఓ రకంగా సాయమే. ఐతే పూర్తిగా జియోకి సాయం చేస్తున్నట్లు మాత్రం కాదు,తన వేల్యూ అన్‌లాక్ చేయడం కోసమే ఇలా ఎయిర్‌టెల్ చేస్తుందని సంస్థ ఎండి,సీఈఓ గోపాల్ విఠల్ చెప్తున్నారు. టెలికాం స్పెక్ట్రమ్‌లో భారతి ఎయిర్‌టెల్ వేల్యూ ఎంతో ఈ డీల్స్‌తో తెలిసి వస్తుందంటూ చెప్పారాయన.
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిల్స్‌లో తన స్పెక్ట్రమ్‌ని జియోకి రూ.1038కోట్లకు జియోకి విక్రయించనుంది. ఏపీలో 3.75మెగాహెర్ట్స్,ఢిల్లీలో 1.25 మెగాహెర్ట్స్, ముంబైలో 2.50మెగాహెర్ట్స్ మేర స్పెక్ట్రమ్‌ను అమ్మడం ద్వారా మిగిలిన స్పెక్ట్రమ్ వేల్యూ ఎంతో ఈజీగానే అర్ధమైపోతుంది. ఈ విక్రయం అంతా ట్రాయ్, టెలికాం డిపార్ట్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారమే జరుగుతుందని రిలయన్స్ సంస్థ కూడా ప్రకటించింది.ఐతే ఈ స్పెక్ట్రమ్ బదిలీపై తుది నిర్ణయం మాత్రం రెగ్యులేటరీ సంస్థల పరిధిలోనే ఉంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com