Bitcoin Drops : ఒక్కరోజులో రూ.4లక్షలు తగ్గిన బిట్‌కాయిన్

బిట్‌కాయిన్ జోరు తగ్గింది. లక్ష డాలర్ల స్థాయి వద్ద గట్టి రెసిస్టెన్సీ ఎదురవ్వడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. సోమవారం ఏకంగా 5000 డాలర్లు నష్టపోయి $93035 వద్ద స్థిరపడింది. అంటే భారత కరెన్సీలో నిన్న ఒక్కరోజే రూ.4లక్షల మేర పడిపోయింది. నేడు $93,006 వద్ద ఓపెనైన BTC $94,920 వద్ద గరిష్ఠ, $94,331 వద్ద కనిష్ఠ స్థాయుల్ని అందుకుంది. ప్రస్తుతం $1300 లాభంతో 94,350 వద్ద కొనసాగుతోంది.
అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, బిట్‌కాయిన్ జోరు మరింతగా పెరిగింది. ఈ కరెన్సీల విషయంలో ట్రంప్ వైఖరి సానుకూలంగా ఉండొచ్చనే అంచనాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొవిడ్-19 పరిణామాల ప్రారంభంలో 5000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ.. 2021 నవంబరులో 69,000 డాలర్ల స్థాయికి చేరింది. 2022లో ఎఫ్‌టీఎక్స్ ఘటనతో 17,000 డాలర్ల దిగువకు పడిపోయింది కూడా. మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com