BSNL 5G : మార్కెట్లోకి బిఎస్ఎన్ఎల్ 5g సిమ్ కార్డ్

BSNL 5G : మార్కెట్లోకి బిఎస్ఎన్ఎల్ 5g సిమ్ కార్డ్
X

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లోపెను మార్పులు కనిపిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వీఐ సంస్థలు భారీగా ఇటీవల టారిఫ్ రేట్లను పెంచటంతో అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. చాలామంది మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ తలొక మొబైల్ ఫోన్ కలిగి ఉంటున్నారు. దీంతో వాటి నెలవారీ ఖరీదైన రీఛార్జీలు సగటు వినియోగదారుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

కేవలం రీఛార్జీలకే ఏడాదికి వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఐతే.. బీఎస్ఎన్ఎల్ రేట్లు పెంచలేదు. దీంతో.. నెట్ వర్క్ పరిధి పెరిగితే, క్వాలిటీ పెంచితే బీఎస్ఎన్ఎల్ కు మారేందుకు సిద్ధంగా ఉన్నారు వినియోగదారులు. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకన్న బీఎస్ఎన్ఎల్ టెక్నికల్ గా అప్ గ్రేడ్ అవుతోంది. 4జీ, 5జీ కనెక్టివిటీ ఏర్పాటుకు టాటాలు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారులకు పూణే నుంచి పెద్ద శుభవార్త వచ్చింది.

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని అధికారులు పెద్ద ట్రీలో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును చూపించారు. ఒక అధికారి బీఎస్ఎన్ఎల్ 5జీ అని వ్రాసిన సిమ్ కార్డుని చూపించాడు. బీఎస్ఎన్ఎల్ నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వీడియో బీఎస్ఎన్ఎల్ 5జీ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని సూచిస్తోంది.

Tags

Next Story