Budget 2026: హిస్టరీ రిపీట్స్..ఆదివారం కూడా ఆగని ట్రేడింగ్..బడ్జెట్ ధాటికి షేర్ మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.

Budget 2026: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్. సాధారణంగా శని, ఆదివారాల్లో షేర్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. కానీ ఈసారి ఆ నిబంధన మారబోతోంది. 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ, ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లు పనిచేస్తాయని అధికారికంగా ప్రకటించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రకటనల వల్ల మార్కెట్‌లో వచ్చే భారీ కదలికలను దృష్టిలో ఉంచుకుని ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నారు.
సాధారణంగా వారంతాల్లో ట్రేడింగ్ ఉండదు, కానీ బడ్జెట్ లాంటి కీలక ఘట్టం ఆదివారం రావడం ఇదే మొదటిసారి కాదు. 2000వ సంవత్సరం తర్వాత, ఆదివారం రోజున పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం మళ్ళీ ఇప్పుడే జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన మార్కెట్ సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఉదయం 9:00 నుండి 9:08 వరకు ప్రీ-ఓపెన్ సెషన్ ఉంటుంది. ఉదయం 9:15 గంటలకు ప్రారంభమయ్యే ట్రేడింగ్, మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగుతుంది. కేవలం ఈక్విటీలే కాకుండా, ఎఫ్ అండ్ ఓ (డెరివేటివ్స్), కమోడిటీ విభాగాల్లో కూడా ట్రేడింగ్ జరుగుతుందని ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి.
ఆదివారం ట్రేడింగ్ జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక సెషన్లకు మినహాయింపు ఇచ్చారు. T+0 సెటిల్మెంట్, ఆక్షన్ సెషన్లు ఆ రోజు ఉండవని బీఎస్ఈ సర్క్యులర్ పేర్కొంది. 2026లో స్టాక్ మార్కెట్ కు మొత్తం 16 పబ్లిక్ సెలవులు ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ కి రెండో సెలవు రానుంది. ఆ తర్వాత మార్చి 3న హోలీ, మార్చి 26న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే నాడు మార్కెట్ పనిచేయదు.
ఏయే రోజుల్లో మార్కెట్ బంద్?
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, మే 1న మహారాష్ట్ర దినోత్సవం, మే 28న బక్రీద్ సందర్భంగా ట్రేడింగ్ ఉండదు. జూన్ 26న మొహర్రం, సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి, అక్టోబర్ 2న గాంధీ జయంతికి మార్కెట్ క్లోజ్ అవుతుంది. అలాగే అక్టోబర్ 20న దసరా, నవంబర్ 10న దీపావళి బలిపాడ్యమి, నవంబర్ 24న గురునానక్ జయంతి నాడు సెలవు ప్రకటించారు. 2026 ఏడాది ఆఖరి సెలవు డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున ఉంటుంది. ఈ సెలవుల క్యాలెండర్ ను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

